ఖ‌ర్చుల్లో మాత్రం సామాన్యుడు కాడంట‌

Update: 2015-06-30 13:59 GMT
సామాన్యుడిగా త‌న‌ను తాను అభివ‌ర్ణించుకుంటూ..త‌నది సామాన్యుల పార్టీ అని చెప్పుకునే ఆమ్ ఆద్మీ అధినేత కేజ్రీవాల్ గురించి తెలిసిందే. సామాన్యుడికి ప్ర‌తిరూపంగా ఉండే ఆయ‌న‌.. మాటల్లోనే కానీ.. చేత‌ల్లోకాద‌న్న విష‌యం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చి చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఎందుకంటే.. తాజాగా ఆయ‌న ఇంటికి వ‌చ్చిన క‌రెంటు బిల్లు కొత్త క‌ల‌కలానికి తెర తీసింది.

సివిల్ లైన్స్ రెసిడెన్స్ ప్రాంతంలో ఉన్న కేజ్రీవాల్ ఇంటికి సంబంధించి ఏప్రిల్‌.. మే నెల‌ల‌కు సంబంధించి క‌రెంటు బిల్లు ఏకంగా రూ.91వేల చొప్పున రావ‌టంపై విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది. సామాన్యుడికి ఇంటి క‌రెంటు బిల్లు అస‌మాన్యంగా ఉండ‌టం ఏమిట‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఈ వివ‌రాల్ని వివేక్ గ‌ర‌గ్ అనే న్యాయ‌వాది బ‌య‌ట‌కు తీసుకొచ్చారు. స‌మాచార హ‌క్కు చ‌ట్టంగా ద్వారా వ‌చ్చిన ఈ స‌మాచారం త‌ప్ప‌ని క‌మ‌ల‌నాథులు ఖండిస్తున్నారు. రెండు నెల‌ల‌కు కేజ్రీవాల్ ఇంటి క‌రెంటు బిల్లు రూ.1,03,000 అని వారు వాదిస్తున్నారు.

ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ క‌రెంటు బిల్లు మాత్ర‌మే కాదు.. ఆప్ మంత్రుల క‌రెంటు బిల్లులు  కూడా భారీగా ఉన్నాయ‌ని.. వాటికి సంబంధించిన వివ‌రాల్ని కూడా త్వ‌ర‌లో తాము బ‌య‌ట‌పెడ‌తామ‌ని చెబుతున్నారు. సామాన్యుల కోసం.. సామాన్యులే అస‌మాన్యులుగా మారి.. పాల‌న అందిస్తూ.. అస‌మాన్యంగా క‌రెంటు బిల్లులు రావ‌టం ఏమిటో..? చూస్తుంటే.. సామాన్యుడి చేతికి అధికారం వ‌చ్చినా.. ఖ‌ర్చులు మాత్రం అస‌మాన్యంగా పెరిగే పోయేట‌ట్లుఉన్నాయే..?
Tags:    

Similar News