అనుకున్నట్లే జరుగుతుంంది. కాకుంటే.. అడగందే అమ్మ కూడా పెట్టదన్న సామెతను గుర్తు చేస్తూ మజ్లిస్ అధినేత తాజాగా కీలక వ్యాఖ్య చేశారు. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఇంకెంత మాత్రం రెండో పెద్ద పార్టీ కాకపోవటంతో తమ పార్టీకే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అసద్ కోరారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. తమ పార్టీ నేతకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని స్పీకర్ ను కోరనున్నట్లు చెప్పారు.
తెలంగాణ అసెంబ్లీలో తమకు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని.. తాజాగా కాంగ్రెస్ కు ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నందున.. ఆ పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించొద్దని ఆయన కోరారు. ఓవైపు తమ పార్టీ ఎమ్మెల్యేల్ని టీఆర్ ఎస్ కలుపుకున్న వైనంపై కాంగ్రెస్ నేతలు ఇప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అలాంటి వేళలో.. వారికి మరింత మంట పుట్టేలా అసద్ మాటలు ఉన్నాయని చెప్పాలి.
ఏడుగురు ఎమ్మెల్యేలు ఉంటే (అసెంబ్లీలో పదిశాతం ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రధాన ప్రతిపక్షం హోదా ఇస్తారు) ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వొచ్చన్న అసద్.. అందుకు ఢిల్లీ అసెంబ్లీని ఉదాహరణగా ప్రస్తావించారు. ఢిల్లీలో మొత్తం 70 మంది ఎమ్మెల్యేలు ఉంటే.. బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారన్నారు. ప్రతిపక్ష హోదా.. ప్రతిపక్ష నేత పదవిని కోరేందుకు తాము త్వరలోనే తెలంగాణ స్పీకర్ ను కలవనున్నట్లుగా ఆయన చెప్పారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే టీఆర్ ఎస్ పట్ల విధేయత చాటుతూ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీసుకున్న నిర్ణయాన్ని ఒవైసీ సమర్థించారు. తాజాగా పార్టీలో చేరిన తీరు చట్టం అనుమతిస్తున్నందున .. దాన్ని తాను మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. మూడింట రెండు వంతుల మందిఎమ్మెల్యేలు పార్టీ మారాలని నిర్ణయించుకుంటే అదేమీ తప్పు కాదని ఆయన అభిప్రాయపడటం గమనార్హం. ఇప్పటివరకూ అనుకున్నట్లే.. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పదవిని.. ప్రధాన ప్రతిపక్ష నేత హోదాను తాము సొంతం చేసుకోవటానికి వీలుగా అసద్ రంగంలోకి దిగారని చెప్పాలి. అసద్ కోరుకున్నాక.. తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఉంటుందా?