ఫిరాయిస్తారా.. జాగ్ర‌త్త వేటు వేస్తాం!

Update: 2019-12-20 05:49 GMT
డెహ్రాడూన్ లో జ‌రుగుతున్న స్పీక‌ర్ల స‌మావేశంలో ఆస‌క్తిదాయ‌క‌మైన కామెంట్లు చేశారు లోక్ స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా. దేశంలోని చ‌ట్ట స‌భ‌ల స్పీక‌ర్లు - చైర్మ‌న్ల‌తో ఆ స‌మావేశం జ‌రిగింది. ఆ సంద‌ర్భంగా ప్ర‌ధానంగా జ‌రిగిన చ‌ర్చ ఫిరాయింపుల గురించినే. దేశంలో ఎమ్మెల్యేల‌ - ఎంపీల ఫిరాయింపుల గురించి వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. తాము ఏ పార్టీ త‌ర‌ఫున నెగ్గినా.. అధికారంలో ఉన్నా పార్టీలో తేలుతున్నారు నేత‌లు.

ఒక రాష్ట్రం అని కాదు.. చాలా రాష్ట్రాల్లో అలానే ఉంది ప‌రిస్థితి. ఏపీలో ఇర‌వై మూడు మంది ఫిరాయించారు. తెలంగాణ‌లో గ‌త ఐదేళ్లలోనూ - ఇప్పుడు ఫిరాయింపులు జ‌రుగుతూనే ఉన్నాయి. మ‌హారాష్ట్ర‌లో - క‌ర్ణాట‌క‌లో.. ఎటు చూసినా ఇదే క‌థ‌. ఇలాంటి నేఫ‌థ్యంలో స్పీక‌ర్ల స‌మావేశంలో ఫిరాయింపుల అంశం చ‌ర్చ‌కు వ‌చ్చింది.

ఈ అంశంపై ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారం కూడా మాట్లాడారు. ఫిరాయింపుల‌ను అరిక‌ట్టాల్సిన అవ‌స‌రం గురించి ఆయ‌న అన్నారు. ఏపీ అసెంబ్లీ ఈ విష‌యంలో క‌ఠినంగా ఉండ‌బోతోంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఇక ఈ స‌మావేశంలో ఓంబిర్లా కూడా అదే చెప్పారు.

ఫిరాయింపుల‌ను ఉపేక్షించే ప‌రిస్థితి లేద‌ని ఆయ‌న అన్నారు. ఒక పార్టీ త‌ర‌ఫున  గెలిచి మ‌రో పార్టీలోకి చేరే ఫిరాయింపుదారుల విషయంలో చ‌ర్య‌ల‌కు జాప్యం వ‌ద్ద‌ని ఆయ‌న త‌న స‌హ‌చ‌రుల‌కు సూచించారు. మొత్తానికి స్పీక‌ర్ల స‌ద‌స్సులో ఇలా ఫిరాయించాల‌నుకునే వారికి వార్నింగ్ వ‌చ్చింది. అధికార పార్టీల్లోకి ఫిరాయించాల‌నుకునే వారికి ఇది వార్నింగ్ బెల్లేనేమో!

   

Tags:    

Similar News