సుదీర్ఘ కసరత్తులో భాగంగా సాగే చర్చా కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు బ్రిటన్ ప్రధానమంత్రి రేసులో ఉన్న ఇద్దరు అభ్యర్థులు. భారత సంతతికి చెందిన రిషి సునాక్ మొదట్లో అధిక్యతలో ఉండగా ఆ తర్వాత అతగాడు వెనుకబడినట్లుగా వార్తలు వచ్చాయి. వీటిని రిషి సైతం అంగీకరించటం తెలిసిందే. రిషి మీద చాలా ముందు ఉన్నట్లుగా చెబుతున్న లిజ్ ట్రస్.. ఇద్దరూ తాజాగా ఒక టీవీ చానల్ డిబేట్ లో పాల్గొన్నారు.
అయితే.. ఈ కార్యక్రమంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధాని పదవిని ఆశిస్తున్న రిషికి తాజా షో.. స్వీట్ షాకిస్తే.. లిజ్ ట్రస్ కు షాకింగ్ గా మారింది. ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్న యాంకర్ పరిస్థితి అవాక్కైనట్లుగా మారింది. ఇంతకూ ఏం జరిగిందంటే..
బ్రిటన్ ప్రధాని పదవి కోసం పోటీ పడుతున్న రిషి.. ట్రస్ లను చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది స్కై టీవీ. దీనికి యాంకర్ గా కే బర్లీ వ్యవహరించారు. డిబేట్ లో భాగంగా.. రిషికి మద్దతు ఇస్తున్న వారి చేతులు పైకి లేపాలని కోరితే.. ఆశ్చర్యకరంగా అక్కడున్న వారిలో అత్యధికులు రిషికే మద్దతు ఇచ్చారు. అనంతరం.. లిజ్ ట్రస్ కు మద్దతు ఇచ్చే వారు చేతులు ఎత్తాలని కోరగా.. స్పందన అంతంతమాత్రంగా ఉండటం షాకింగ్ గా మారింది. ఎన్నికల్లో 90 శాతం మంది మద్దతుతో ట్రస్ దూసుకెళుతుండగా.. రిషి మాత్రం కేవలం 10 శాతం మంది మద్దతుతో చాలా వెనుకపడిపోయారు.
ఎన్నికల ప్రక్రియ ముగిసే చివరి వరకు తాను పోరాడుతానే ఉంటానని రిషి పేర్కొనటం తెలిసిందే. ఈ చర్చా కార్యక్రమంలో భాగంగా యాంకర్ గా వ్యవహరించిన కే బర్లీ.. ఈ ఇద్దరికి కఠినమైన ప్రశ్నల్ని సంధించారు. నిజానికి.. ఈ తరహా ప్రశ్నలు మన వాళ్లు అడగాలే కానీ.. పరిస్థితి మరోలా ఉంటుందని చెప్పాలి. ఈ ఇద్దరికి సంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పే విషయంలో లిజ్ ట్రస్ ఇబ్బందికి గురయ్యాయి. అలా అని రిషికి సులువైన ప్రశ్నలేం లేవు. కాకుంటే.. తనకు ఎదురైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పే విషయంలో లిజ్ ట్రస్ మాదిరి ఇబ్బందికి గురి కాలేదు.
ఇరువురికి ఎదురైన ప్రశ్నల విషయానికి వస్తే.. లండన్ బయట నివసించే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తగ్గించాలని డిమాండ్ చేసి.. ఇప్పుడు యూ టర్న్ తీసుకోవటం ఏమిటంటూ లిజ్ ట్రస్ ను ప్రశ్నించగా.. మీడియా తన వ్యాఖ్యను తప్పుగా ప్రచారం చేసినట్లుగా ఆమె పేర్కొన్నారు. దీనికి ప్రతిగా యాంకర్ గా వ్యవహరిస్తున్న కే బర్లీ స్పందిస్తూ.. ‘మంచి నాయకులు తమ తప్పులను ఒప్పుకుంటారా? ఇతరులను నిందిస్తారా?’ అంటూ పాయింట్ బ్లాక్ లో అన్నట్లుగా వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన ఆమె.. తాను ఎవరిని నిందించటం లేదని.. తాను ప్రతిపాదించిన విధానాన్ని వక్రీకరించారని చెబుతున్నట్లుగా చెప్పారు. ఈ సందర్భంగా ఆమె సమాధానంలో తడబాటు కనిపించింది. ఇలాంటివే మరిన్ని కఠినమైన ప్రశ్నల్ని ఎదుర్కొన్నారు.
రిషి సునాక్ సైతం కఠినమైన ప్రశ్నల్ని ఎదుర్కొన్నారు. ‘మీరు ఖరీదైన ప్రాడా షూస్ లో నడుస్తున్నందున సామాన్యులు వాడే బూట్లు ధరించి ఒక మైలు కూడా నడవలేరని ప్రజలు భావిస్తున్నారు’ అంటూ గురి పెట్టి విడిచిన బాణం మాదిరి ప్రశ్నను సంధించారు.
దీనికి రిషి బదులిస్తూ.. తాను ఎన్ హెచ్ ఎస్ కుటుంబంలో పెరిగానని.. తన ప్రచారంలో ఆ విషయం గురించి వినే ఉంటారన్న ఆయన.. తాను మొదట్నించి ఉన్నత ఆదాయ వర్గానికి చెందిన కుటుంబం వాడినే తప్పించి.. నడమంత్రపు సిరి మాదిరి బిలీయనీర్ అయిన మామ కారణంగా తన అలవాట్లలో మార్పు లేదన్న విషయాన్ని తన ఆన్సర్ గా చెప్పకనే చెప్పారని చెప్పాలి. కార్యక్రమంలో ఇరువురిలో ఎవరికి మద్దతు ఇస్తారని అడిగిన వైనంలో షోకు హాజరైన వారిలో అత్యధికులు రిషికి మద్దతు పలకటం.. దానికి రిషి సైతం విస్మయానికి గురయ్యారు.