నందమూరి బాలకృష్ణను ప్రచారానికి తెస్తే సినీ గ్లామర్ తోడై నంద్యాల ఉప ఎన్నికల్లో కలిసొస్తుందని ఆశించాయి తెలుగుదేశం శ్రేణులు. కానీ బాలయ్య రాకతో జరిగిన పరిణామాలు చూశాక.. ఈయన్నెందుకు ప్రచారానికి తెచ్చారయ్యా బాబూ అంటూ తలలు పట్టుకుంటున్నారు. ఆయన వల్ల జరిగిన మేలు సంగతేమో కానీ.. చేటు మాత్రం బాగానే జరిగిందని.. అసలే ప్రతికూల పవనాలు వీస్తున్న సమయంలో బాలయ్య వల్ల జనాల్లో మరింత వ్యతిరేకత ఎదుర్కొంటున్నామని స్థానిక తెలుగుదేశం నాయకులు ఆందోళన చెందుతున్నారు.
నిన్నటి ప్రచారంలో బాలయ్య ప్రసంగం జనాల్ని ఏమంత ఆకర్షించలేదు. కానీ ఆ ప్రసంగం అనంతరం తాను ప్రచారం చేసిన వాహనం మీది నుంచే నోట్ల కట్ట పట్టుకుని కింద ఉన్న జనాలకు డబ్బులు పంచడం ద్వారా అందరి దృష్టినీ బాగానే ఆకర్షించారు బాలయ్య. ఈ రోజుల్లో చాటు మాటుగా డబ్బుల పంపకాలు చేస్తేనే బయటపడిపోతోంది. అలాంటిది బహిరంగంగా డబ్బులు పంచి అడ్డంగా బుక్కయ్యాడు బాలయ్య. రోడ్డు మీద నృత్యం చేసిన వాళ్లకు పారితోషకంగా డబ్బులిచ్చామని కవర్ చేస్తున్నప్పటికీ దాన్ని బుకాయింపుగానే భావిస్తున్నారు జనాలు. ఎన్నికల సంఘం సీరియస్ గా ఈ విషయాన్ని పరిగణిస్తే తెలుగుదేశం పార్టీకి చిక్కులు తప్పవు. ఈసీ సంగతలా ఉంచితే బాలయ్య చేసిన పనితో తెలుగుదేశం పార్టీ మీద జనాల్లో వ్యతిరేక అభిప్రాయం పడింది.
ఇది చాలదన్నట్లుగా నిన్న రాత్రి తాను బస చేయాల్సిన భవనంలోకి వెళ్తూ తనకు గజమాల వేయబోతూ కొంచెం మీద పడ్డాడని ఓ అభిమానిని లాగి పెట్టి కొట్టాడు బాలయ్య. దానికి సంబంధించిన వీడియో ఈ ఉదయం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండు వారాల ముందే తన సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా తన అసిస్టెంటును చెంపదెబ్బ కొట్టి నేషనల్ మీడియాలోనూ హైలైట్ అయ్యాడు. కావాల్సినంత చెడ్డపేరు తెచ్చుకున్నాడు బాలయ్య. అదైనా షూటింగ్ కాబట్టి.. పర్సనల్ వ్యవహారం అయిపోయింది. కానీ ఇప్పుడు పబ్లిక్ లో.. ఓవైపు ఎన్నికల రణరంగం సాగుతున్న సమయంలో అభిమానిపై చేయి చేసుకోవడం బాలయ్య ఇమేజ్ నే కాక తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను కూడా దెబ్బ తీసింది. మొత్తానికి బాలయ్య తీరుతో నంద్యాల తెలుగుదేశం నేతలు తలలు పట్టుకునే పరిస్థితి వస్తోంది. మరోవైపు వైఎస్సార్ సీపీ మాత్రం బాలయ్య ప్రచారంతో సూపర్ హ్యాపీగా ఉంది.