ఎన్నికల బరిలో క్రికెట్ కెప్టెన్!

Update: 2018-11-13 08:13 GMT
క్రికెటర్లు రిటైర్ అయిపోయాక రాజకీయ నాయకులుగా మారిపోవడం ఎప్పటినుంచో చూస్తున్నాం.. పాకిస్తాన్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి ప్రధానమంత్రి కూడా అయ్యారు. అలాగే శ్రీలంకలో రణతుంగ  - ఆస్ట్రేలియా - ఇంగ్లండ్ - సౌతాఫ్రికాల్లో కూడా క్రికెటర్లు ఆ దేశ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇండియాలోనూ సచిన్  - సిద్దూ లాంటివారు ఎంపీలుగా కొనసాగుతున్నారు.

తాజాగా బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్రఫ మోర్తాజా రాజకీయాల్లోకి అరంగేట్రం చేయబోతున్నాడు. వచ్చేనెలలో జరిగే బంగ్లాదేశ్ ఎన్నికల్లో మోర్తాజా పోటీ చేస్తున్నట్లు ఆ దేశ ప్రధాని షేక్ హసీనా ప్రకటించారు.

క్రికెట్ అంటే పడి చచ్చే బంగ్లాదేశ్ లో మొర్తాజాకు విపరీతమైన క్రేజ్ ఉంది. అధికార పార్టీ అవామీ లీగ్ తరఫునే మోర్తాజా బరిలోకి దిగుతున్నాడట.. రాజకీయాల్లో రాణించాలనుకున్న మోర్తాజాకు ప్రధాని షేక్ హసీనా ప్రోత్సాహం తోడవడంతో రాజకీయ అరంగేట్రం ఖాయంగా మారింది. మొర్తాజా సొంత జిల్లా అయిన పశ్చిమ బంగ్లాదేశ్ లోని నరైలీ నుంచి పోటీచేయాలని డిసైడ్ అయినట్టు సమాచారం.

మోర్తాజా 2019 వన్డే ప్రపంచ కప్ తర్వాత వైదొలిగేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే టెస్ట్ - టీ20లకు వీడ్కోలు పలికాడు. రాజకీయాల్లోకి వెళ్లాలన్న మోర్తాజా నిర్ణయంపై బంగ్లా క్రికెట్ బోర్డు కూడా ఆమోదముద్ర వేసింది. అయితే అందరూ రిటైర్ మెంట్ తర్వాత రాజకీయాల్లోకి వెళితే మోర్తాజా మాత్రం క్రికెటర్ గా ఉండగానే రెండో ఇన్నింగ్స్ ఆరంభించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బహుశా క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలనే ప్రయత్నంతోనే ఇలా చేస్తుండవచ్చనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
   

Tags:    

Similar News