ఈ సృష్టి లోని సకల చరాచర జీవరాశుల్లో మనిషి గొప్పవాడనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆలోచనా శక్తి...విచక్షణా జ్ఞానం...విజ్ఞత వంటివి ఉన్నాయి కాబట్టి..పశుపక్ష్యాదులు...జంతువుల కంటే మనిషి కొద్దిగా గొప్ప అని ఫీల్ కావడంలో తప్పులేదు. అయితే - పశుపక్ష్యాదులు - జంతువులలో కూడా పట్టుదల ఉంటుందని గతంలో పలుమార్లు నిరూపితమైంది. అదే పట్టుదలతో పట్టువదలని విక్రమార్కుడిలా...ఓ ఎలుగుబంటి పిల్ల చేసిన పని ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓ మంచుకొండను ఎక్కే క్రమంలో పదే పదే కిందకు పడిపోతోన్న...ఏ మాత్రం నిరాశ చెందని ఆ గుండెలు తీసిన పిల్ల బంటుకు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఎలాగైనా కొండపైకి ఎక్కిన తన తల్లిని చేరుకోవాలన్న ఆ పిల్ల ఎలుగు తపన చూపరులను కట్టిపడేసింది. ఎట్టకేలకు ఆ కొండను అధిరోహించి...విజయ గర్వంతో తన తల్లిని చేరుకున్న పిల్ల ఎలుగుబంటి వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
``ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి...ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి....నీరసించి నిలిచిపోతె నిమిషమైన....నీది కాదు బ్రతుకు అంటె నిత్య ఘర్షణ....నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా.....నిన్ను మించి శక్తి ఏది నీకె నువ్వు బాసటయ్యితే`` అంటూ ఓ సినీకవి అద్భుతంగా ఈ పాటను రాశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటమిని ఒప్పుకోవద్దని...గెలిచేదాకా ప్రయత్నిస్తూనే ఉండాలని ఆ పాట సారాంశం. ఇదే కాదు ఇటువంటి పాటలు చాలానే ఉన్నాయి. కానీ, ఆ పాట స్ఫూర్తితో అన్ని సార్లు పట్టువదలకుండా ప్రయత్నించడం చాలామందికి సాధ్యం కాకపోవచ్చు. చిన్న చిన్న అపజయాలకే కుంగిపోయే వారిని మనం చూస్తూనే ఉన్నాం. కానీ, జీవితమే ఓ ఆట..సాహసమే పూబాట అన్న సూత్రాన్ని వంటబట్టించుకున్న ఓ పిల్ల ఎలుగుబంటి ఫీట్ మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ‘ఈ పిల్ల ఎలుగుబంటి నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు’అని డైలీ మెయిల్ ఆ ఎలుగుబంటిపై ఏకంగా ఓ కార్యక్రమం ప్రసారం చేసింది.
ఓ తల్లి ఎలుగు బంటి.. పిల్ల ఎలుగుబంటి కలిసి మంచు కొండను ఎక్కుతుంటాయి. అయితే, తల్లి ఎలుగు బంటి అవలీలగా మంచు కొండపైకి చేరుకుంటుంది. కానీ, పిల్ల ఎలుగుబంటి మొదటి ప్రయత్నంలో కొండ ఎక్కడంలో విఫలమవుతుంది. అయినా, పట్టువిడవకుండా...మరోసారి కొండపైకి ఎక్కేందుకు ప్రయత్నించి విఫలమవుతుంది. అయినా, సరే మూడోసారి కూడా ప్రయత్నిస్తుంది. పైకి ఎక్కుతున్నా కొద్దీ మంచులో కిందికి జారిపోతున్నా ప్రయత్నించి మరోమారు విఫమవుతుంది. ఈ సారి ఏకంగా....ఆ కొండ అడుగుకు పడిపోతుంది. ఇక, ఆ పిల్ల ఎలుగుబంటి పని అయిపోయిందని అంతా అనుకుంటారు. కానీ, ఏ మాత్రం నిరాశ చెందని ఆ పిల్ల ఎలుగు....మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో నాలుగోసారి కొండను ఎక్కడం ప్రారంభించి....ఎట్టకేలకు లక్ష్యాన్ని చేరుకుంటుంది. జీవితంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా...లైఫ్ మస్ట్ గో ఆన్ అన్నతరహాలో...అనుకున్న లక్ష్యాన్ని- గమ్యాన్ని చేరుకోవడానికి అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉండాలని ఆ పిల్ల ఎలుగును చూసి మనం నేర్చుకోవాలి. అందుకే, ఆ పట్టువదలని గుండెలు తీసిన బంటుకు నెటిజన్లు సలాం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియో ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతోంది.
Full View