నిజామాబాద్ జిల్లా పరిషత్ లో ప్రజా ప్రతినిధుల మధ్య అంతర్గత పోరు తీవ్రస్థాయి చేరుకుంది. ఇదికాస్తా జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవికి చెక్ పెట్టేలా మారుతోంది. జడ్పీ ఛైర్మన్ విఠల్ రావు ప్రస్తుతం సొంత పార్టీ నేతల మధ్య నలిగిపోతున్నారు. అభివృద్ధి నిధుల విషయంలో ఎమ్మెల్యేలను ఒప్పించలేక, జడ్పీటీసీలకు నిధులు ఇప్పించలేక సతమతమైపోతున్నారట. దీంతో ఆయన తీరుపై జడ్పీటీసీలు రగిలిపోతున్నారట. అలాగే ఒకరిద్దరు ఎమ్మల్యేలు జడ్పీ ఛైర్మన్ తీరు తో దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి జిల్లాకు 32కోట్ల ఉపాధి హామి నిధులు మంజూరైనట్లు సమాచారం. ఈ నిధుల్లోంచి చిన్న మండలానికి 25లక్షలు, పెద్ద మండలానికి 50లక్షలు ఇచ్చేలా జడ్పీటీసీలను ప్రతిపాదనలు కోరారట. అయితే జడ్పీటీసీల ప్రతిపాదనలపై, ఐదు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలిపినట్లు తెలుస్తోంది. అంత మొత్తంలో నిధులు ఇవ్వడం కుదరదంటూ ఒక్కో జడ్పీటీసీకి రూ.5లక్షల పనులు ఇచ్చేలా నిర్ణయించారట. తమ ప్రతిపాదనలకు బుట్టదాఖలు చేయడంపై, నిధులు ఇచ్చే విషయంలో ఎమ్మెల్యేలతో ఛైర్మన్ గట్టిగా మాట్లాడకపోవడంతో జడ్పీటీసీలు బహిరంగగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.
జడ్పీటీసీ తీరుపై విఠల్ రావు ఎమ్మెల్యేల కు చెప్పలేక లోలోపల కుమిలిపోతున్నారట. ఇటు ఛైర్మన్ తీరుపై ఒకరిద్దరూ ఎమ్మెల్యేలు అంటీ ముట్టనట్టుగా ఉన్నారట. ఉపాధి హామి నిధులతో చేపట్టే పనులకు జడ్పీ సమావేశంలో తీర్మానం చేయవద్దని నిర్ణయించారనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేలు జడ్పీటీసీల మధ్య నెలకొన్న కాసులలొల్లి జడ్పీ ఛైర్మన్‌కు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది.
దీంతో జడ్పీచైర్మన్ త్వరలో పంచాయతీరాజ్ శాఖా మంత్రిని కలవాలనుకుంటున్నారట. ఐతే ఎమ్మెల్యేల ప్రతిపాదన కాదని, జడ్పీ ఛైర్మన్ వినతిని ఏ మేరకు ఆమోదిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. నియోజవర్గంలో దాదన్నగా పేరుతెచ్చుకున్న విఠల్ రావు పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలా తీరు చివరికీ తన జడ్పీ ఛైర్మన్ పదవీకి ఎసరుపెట్టేలా కన్పిస్తుంది. ప్రస్తుత పరిస్థితి నుంచి దాదన్న ఎలా గట్టెక్కుతారో వేచి చూడాల్సిందే..