ర్యాంకుల ఇష్యూ మోడీ దగ్గరకు వెళ్లిందట

Update: 2016-07-19 04:27 GMT
కేంద్రం ఒక సర్వే నిర్వహించిందని.. ఆ సర్వేలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మొదటి ర్యాంకు వచ్చిందంటూ ప్రచార మాధ్యమాల్లో వార్తలు రావటం తెలిసిందే. అయితే.. ఇవన్నీ ఉత్త అబద్ధాలుగా బీజేపీ నేతలు కొట్టేస్తున్నారు. తాజాగా బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ మీడియా ముందుకు వచ్చారు. తెలంగాణకు కేసీఆర్ ఏం చేశారని.. మొదటి ర్యాంకు ఇవ్వటానికి అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రులకు ర్యాంకులు ఇచ్చినట్లుగా వచ్చిన వార్తల్లో నిజం లేదన్న ఆయన.. రాష్ట్రాలపై కేంద్రం సర్వే నిర్వహించలేదని స్పష్టం చేశారు.

రాష్ట్రాలపై సర్వే నిర్వహించనప్పుడు కేసీఆర్ కు ఫస్ట్ ర్యాంక్ ఎలా వస్తుందని ప్రశ్నించారు. ర్యాంకుల మీద వస్తున్న సమాచారం అంతా తప్పుడు వార్తలని.. దీని గురించి ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన చెప్పారు. ర్యాంకులు ఇచ్చారంటూ వచ్చిన వార్తలపై సమాచార శాఖ విచారణ చేపట్టిందని చెప్పుకొచ్చారు. కేంద్రం సర్వే జరిపించి.. ముఖ్యమంత్రులకు ర్యాంకులు ఇచ్చిందన్న వార్తలకు మూలం ఎక్కడ? ఎవరు దీనికి బాధ్యులో..?
Tags:    

Similar News