బీజేపీ పెద్ద‌ల మాట‌...టీడీపీతో పొత్తు డౌటే

Update: 2017-09-13 08:41 GMT
మిత్ర‌ప‌క్ష‌మైన తెలుగుదేశం పార్టీలో రానున్న 2019 ఎన్నికల్లో క‌లిసి సాగాలా?  లేదా సొంతంగా ముందుకు సాగాలా అనే విష‌యంలో బీజేపీ నేత‌లు క్లారిటీకి రాలేక‌పోయారు. భారతీయ జనతాపార్టీ రాష్టప్రదాధికారుల సమావేశం ఒంగోలులోని జ‌రిగిన స‌మావేశంలో పలు అంశాలపై ముఖ్యనేతలందరు చర్చించ‌గా... తెలుగుదేశం ప్రభుత్వంతో పొత్తుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఏం తేల్చ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో ఆ పొత్తు అనే అంశంపై పదాధికారులు చర్చించినట్లు పార్టీవర్గాల సమాచారం. రాష్ట్రస్థాయి  పదాధికారుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు - అఖిలభారత పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి సతీష్‌ జీ - రాష్టమంత్రులు  కామినేని శ్రీనివాస్ - పి మాణిక్యాలరావు - కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధీశ్వరి - పార్లమెంటుసభ్యులు జి గంగరాజు - ఎమ్మెల్సీలు సోము వీర్రాజు - సత్యనారాయణ - మాధవ - శాసనసభ్యులు విష్ణుకుమార్‌ రాజు - ఆకుల సత్యనారాయణ - రాష్టపార్టీ నాయకులు కన్నా లక్ష్మినారాయణ - కావూరి సాంబశివరావు - 13జిల్లాల పార్టీ అధ్యక్ష - ప్రధానకార్యదర్శులు పాల్గొన్నారు. రాష్టస్ధ్రాయిలో పార్టీక్యాడర్‌ తో తెలుగుదేశంపార్టీ నాయకులు స‌త్సంబంధాలు కొనసాగిస్తున్నప్పటికీ జిల్లాల్లో మాత్రం బీజేపీ నేతలతో తెలుగు తమ్ముళ్ళు సఖ్యతగా ఉండటం లేదన్న అభిప్రాయానికి పదాధికారులు వచ్చినట్లు తెలుస్తోంది. కేంద్రప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు బస్సు యాత్రను రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో చేయాలని పదాధికారులు నిర్ణయించారు. కేంద్రప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలను రాష్ట్రప్రభుత్వం హైజాక్‌ చేసి వారి పథకాలుగా మార్చుకుంటున్న విషయాలపై కూడా పదాధికారులు చర్చించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాల పేర్లను మార్చకుండా రాష్ట్రప్రభుత్వం అదే పేర్లతో ప్రవేశపెట్టాలని పదాధికారులు తీర్మానించారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషిచేయాలని నేతలు ముక్తకంఠంతో తీర్మానించారు. 2019ఎన్నికల నాటికి రాష్ట్రంలో ఓటింగ్ శాతం పెంచుకునే విధంగా చర్యలు తీసుకోవాలని పదాధికారులు అభిప్రాయానికి వచ్చారు.

కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలపై కూడా పదాధికారులు పూర్తిస్ధాయిలో విశ్లేషించినట్లు సమాచారం.కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీకి తొమ్మిది స్ధానాలను తెలుగుదేశంపార్టీ అధిష్టాన వర్గం కేటాయించి, అందులో కొన్నిచోట్ల తెలుగుదేశంపార్టీకి చెందినవారినే రెబల్స్‌ గా పోటీలోకి దించారని అందువలన పార్టీ అభ్యర్థులు గెలవలేకపోయారన్న అభిప్రాయానికి పదాధికారులు వచ్చినట్లు సమాచారం. ఈనేపధ్యంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలుగుదేశంపార్టీతో పొత్తు ఉండవచ్చులేదా ఉండకపోవచ్చుననే అభిప్రాయానికి పదాధికారులు వచ్చినట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News