ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. బీజేపీ కోసం పని చేస్తున్నారా? భారీ ఖర్చు, ప్రచార ఆర్బాటంతో ఆయన చేపట్టిన సుదీర్ఘ పాదయాత్రకు కేంద్రంలోని పెద్దల అండ ఉందా? అనే ప్రశ్నలు తెరమీదికి వచ్చాయి. ఈ విషయంలో బిహార్లోని అధికార పక్షమైన జేడీయూ.. పీకే అనుచరుల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరుగుతోంది.
జన సురాజ్ పేరిట సామాజిక సంస్థను స్థాపించి, బిహార్లో సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. బీజేపీ కోసమే పనిచేస్తున్నారని జేడీయూ ఆరోపించింది.
పీకే అక్టోబర్ 2న ప్రారంభించిన 3,500 కిలోమీటర్ల పాదయాత్రకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించింది. జేడీయూ బిహార్ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్.. ఈ మేరకు ప్రశాంత్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. బిహార్ ఇంకా వెనుకబడే ఉందన్న ఆరోపణల్ని తిప్పికొట్టారు.
నీతీశ్ కుమార్ పాలనలో బిహార్ ఎంత అభివృద్ధి చెందిందో ప్రజలకు తెలుసు. ప్రశాంత్ కిశోర్ మాకు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన పని లేదు. ఇతర పౌరుల్లా ఆయన కూడా పాదయాత్ర చేపట్టవచ్చు. ప్రచార కార్యక్రమానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు. కానీ.. ఆయన బీజేపీ తరఫునే పనిచేస్తున్నట్టు కనిపిస్తోందని అన్నారు.
ప్రచారం కోసం ఆయన చేస్తున్న ఖర్చు అనుమానాలకు తావిస్తుండడం గమనార్హం. బడా పార్టీలు కూడా పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చిన సందర్భాలు చాలా తక్కువ. కానీ.. ఆయన పాదయాత్ర కోసం ఆ పని చేశారు.
పెద్ద యాడ్లు ఇచ్చారు. అయితే.. ఇంత జరుగుతున్నా.. ఆదాయ పన్ను శాఖ, సీబీఐ, ఈడీ ఈ విషయాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదనేది ప్రజాస్వామ్య వాదుల మాట. దీంతో పీకేకు బీజేపీ మద్దతు ఉందనే చర్చ జోరుగా జరుగుతుండడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.