ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో దేశ ప్రజల్ని అమితంగా ఆకర్షిస్తున్నాయి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలు. అధికార టీఎంసీకి షాకిచ్చి.. రాష్ట్రంలో అధికారాన్ని సొంతం చేసుకోవాలని తపిస్తున్నారు కమలనాథులు. అందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. పోటాపోటీగా ప్రచారం చేస్తున్న బీజేపీ నేతలు.. ఏ చిన్న అవకాశాన్ని విడిచి పెట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మమతకు ఉన్న ‘దీదీ’ ఇమేజ్ కు తగ్గట్లే.. ప్రధాని మోడీ ఇమేజ్ ను సరికొత్తగా బిల్డ్ చేయాలన్న యోచనలో కమలనాథులు ఉన్నారు. మమతను దీదీ అని పిలుచుకునే బెంగాల్ లో మోడీని ‘దాదా’ అని పిలిచే కార్యక్రమాన్ని షురూ చేశారు. దీదీ అంటే సోదరి.. దాదా అంటే సోదరుడు. ఇలా బెంగాలీలు కనెక్టు అయ్యేందుకు వీలుగా తమ వ్యూహాన్ని కమలనాథులు సిద్ధం చేసుకున్నారు.
దీనికి సంబంధించిన ఫోటోల్ని బీజేపీ నేతలు పెద్ద ఎత్తున షేర్ చేసుకుంటున్నారు. మరి.. దీదీకి పోటీగా తీసుకొచ్చిన దాదా ప్రచారంతో మమతకు కమలనాథులు షాకివ్వటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. బీజేపీ నేతల దూకుడును బెంగాల్ ముఖ్యమంత్రి ఏ రీతిలో అడ్డుకుంటారన్నది ఇప్పుడు ప్రశ్న. ఇప్పటివరకు వెలువడిన పోల్స్ అన్ని.. మమతకే తిరిగి అధికారం ఖాయమని చెబుతున్నా.. రెండుపార్టీలు మాత్రం పోటాపోటీగా ఏ మాత్రం అవకాశం ఇవ్వని రీతిలో ప్రచారాన్ని నిర్వహిస్తుండటం గమనార్హం.