ఓడిపోతామని తెలిసినా.. గెలుపు కోసం ప్రయత్నించడం.. వీరుల లక్షణం.. దీనిని ఎవరూ కాదనరు. అయితే.. అసలు ఏమాత్రం బలం లేని..ఎక్కడా గెలుపు ఊహించడానికి కూడా అవకాశం లేని చోటబీజేపీ ప్రయాస పడుతుండడమే ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. ఈ నెల 30న కడప జిల్లా బద్వేల్‌లో ఉప ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలో ఇక్కడ ప్రధాన పార్టీల్లో వైసీపీ పోటీ చేస్తుండగా.. టీడీపీ, జనసేనలు తప్పుకొన్నాయి.అయితే.. తగుదునమ్మా.. అంటూ.. బీజేపీ ఇక్కడ నుంచి పోటీ కి దిగింది. అంతేకాదు... రాష్ట్ర పార్టీ చీఫ్.. సోము వీర్రాజు ఇక్కడే మకాం వేసి మరీ.. పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. నాయకులను తరలించి.. ప్రచారం చేయిస్తున్నారు.
ఇంత వరకు బాగానేఉంది. అయితే.. ఉప ఎన్నిక కోసం.. బలమైన వైసీపీని ఎదుర్కొనేందుకు సోము.. వీర్రాజు చేసిన ప్రయత్నం సర్వత్రా విస్మయానికి దారితీసింది. ఏకంగా .. కేంద్రానికి చెందిన మంత్రులను ఆయన ఇక్కడకు తీసుకువచ్చి ప్రచారం చేయిస్తు న్నారు. ఒక చిన్న ఎన్నిక.. పైగా సానుభూతి పొంగిపొర్లుతున్న ఉప పోరు. ప్రధాన పార్టీలు తప్పుకొన్న ఎన్నికలో సోము ప్రయా సలు చూస్తున్నవారు.. ఎందుకీ ఫీట్లు..? అని ప్రశ్నిస్తున్నారు. ఇక, తాజాగా బద్వేల్ ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన కేంద్ర పశు సంవర్థక మంత్రి మురగన్ కడప జిల్లాలో పర్యటించారు. తిరుపతి నుంచి నేరుగా బద్వేల్ కు చేరుకున్న మంత్రి పార్టీ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన వాహనంపై ఎక్కి రోడ్డు షోలో పాల్గొన్నారు.
ఏకంగా ఆయన బహిరంగ సభలో పాల్గొన్నారు. బద్వేల్ లో గత 40 ఏళ్లుగా వైయస్ ప్యామిలీనే పాలకులుగా ఉన్నారని అన్నా రు. అయినా ఏమాత్రం అభివృద్ది జరగలేదన్నారు. వైయస్సార్ సీఎం గా పని చేశారని తరువాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి కూడా సీఎంగా ఉన్నా బద్వేల్ లో ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజీని కూడా ఏర్పాటు చేయకపోయారన్నారు.దేశ ప్రధాని నరేంద్ర మోడీ అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారన్నారు. అభివృద్ది ప్రభుత్వం కావాలో లిక్కర్ ప్రభుత్వం కావాలో తేల్చుకోవాలన్నా రు. వైసీపీ గెలిస్తే ఆ పార్టీకి మరో ఎమ్మెల్యే వస్తారని కానీ బీజేపీ అభ్యర్తి గెలిస్తే మోడీ సహకారంతో బద్వేల్ ను అభివృద్ది చేస్తార న్నారు. అభివృద్ది ప్రభుత్వం కావాలో లిక్కర్ ప్రభుత్వం కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు.
దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నాయి. అంటే.. ఒక ఎమ్మెల్యేను గెలిపిస్తే.. నే మోడీ అభివృద్ధి చేస్తారా? ఇదేనా కేంద్ర మంత్రిస్థాయిలో ఉన్న నాయకుడు చెప్పేది? ఇది బ్లాక్‌మెయిల్ కాదా? అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. తమిళియన్ అయిన..కేంద్ర మంత్రిని తెచ్చి.. ప్రచారం చేయించే బదులు.. తాను పోటీ చేయకపోయినా.. గతంలో తిరుపతి ఉప ఎన్నికలో ప్రచారం చేసిన పవన్‌ను తీసుకువచ్చి ప్రచారం చేయించవచ్చుకదా! అనే వ్యాఖ్యలు కూడా వినిపించాయి. మొత్తానికి బద్వేల్‌లో సోము వీర్రాజు ఓవరాక్షన్ చేస్తున్నారనే కామెంట్లు మాత్రం నెటిజన్ల నుంచి జోరుగా వినిపించడం గమనార్హం.