నవ్యాంధ్ర, తెలంగాణ మధ్య అనుసంధానం

Update: 2015-08-18 12:41 GMT
నవ్యాంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య అనుసంధానం ఏర్పడనుంది. గుంటూరు, నల్లగొండ జిల్లాల మధ్య రూ.50 కోట్ల నిధులతో తంగెడ-మట్టపల్లి మధ్య ఉమ్మడి రాష్ట్ర నిధులతో కృష్ణా నదిపై బ్రిడ్జిని నిర్మించనున్నారు. ఈ పనులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి కూడా. దాంతో తెలంగాణలోని సిమెంట్ పరిశ్రమ ఉత్పత్తులు, గుంటూరు జిల్లాలోని మిర్చి, పత్తి ఉత్పత్తులు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తరలించేందుకు దూరం తగ్గనుంది.

2013లో మట్టపల్లిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని గవర్నర్ నరసింహన్ దర్శించుకున్నారు. అప్పట్లోనే కృష్ణా నదిపై బ్రిడ్జిని నిర్మంచాలని ప్రజలు కోరారు. దాంతో వెంటనే ఆయన నిధులు మంజూరు చేశారు. కిరణ్ హయాంలో ఇప్పటి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ బ్రిడ్జి పూర్తయితే సిమెంటు పరిశ్రమల ఖిల్లా అయిన నల్లగొండ నుంచి నవ్యాంధ్రలోని కోస్తాంధ్ర, రాయలసీమలతోపాటు ఇతర రాష్ట్రాలకు కూడా రవాణా చాలా సులభం అయిపోతుంది. సింగరేణి కాలనీ నుంచి ఇతర రాష్ట్రాలకు బొగ్గు రవాణాకు వంద కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఖమ్మం, వరంగల్, నల్లగొండల్లో పండే మిరప పంటను గుంటూరు మిర్చి యార్డుకు తరలించడం ఈజీ అవుతుంది. 2016 ఆగస్టులో ప్రారంభం కానున్న కృస్ణా పుస్కరాల నాటికి దీనిని పూర్తి చేయాలని అధికారులు కంకణం కట్టుకున్నారు.
Tags:    

Similar News