డబ్బు కోసం కొందరు దుండగులు చేసిన పని ఓ మహిళ ప్రాణాల మీదకు వచ్చింది. డబ్బును కాపాడుకోవాలని ఆ మహిళ.. దక్కించుకోవడానికి దొంగలు చేసిన పనిలో పాపం మహిళ తీవ్రంగా గాయపడింది. ఇప్పుడు ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఆ లైవ్ వీడియో సిసీ కెమెరాల్లో నిక్షిప్తం కావడంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
అమెరికాలోని హ్యుస్టన్ లో ఓ మహిళ తన వ్యాపార అవసరాల కోసం 75వేల డాలర్లను(52లక్షల రూపాయలు) బ్యాంకు నుంచి విత్ డ్రా చేసింది. గమనించిన కొందరు దుండగులు ఎలాగైనా ఈ డబ్బును కాజేయాలని ప్లాన్ చేశారు. మహిళ కారులో బయలు దేరగానే మరో కారులో వెంబడించారు. ఆమె తనకు చెందిన వలేరో గ్యాస్ స్టేషన్ వద్దకు రాగానే .. కారులో నుంచి దుండగుడు బయటకు వచ్చి ఆమె దిగగానే బ్యాగ్ లాక్కెళ్లడానికి ప్రయత్నించాడు. మహిళ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది . ఎంతకు ఆమె డబ్బు ఉన్న బ్యాగ్ ను విడవకుండా పెనుగులాడింది. ఇంతలోనే గ్యాస్ స్టేషన్ నుంచి మహిళ భర్త కూడా వచ్చి దుండగుడిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో ఇంతలోనే మరో కారులో వచ్చిన దుండగులు మహిళ, ఆమె భర్తపై దాడికి పాల్పడ్డాడు. అనంతరం వారి ముందుభాగంగా నిలిపిన కారును వేగంగా వెనక్కి తీసుకొచ్చి మహిళపైకి ఎక్కించారు. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే పోలీసులకు ఫోన్ చేయగా.. వారు దుండగుల కారును వెంబడించి అందులో ఒకరిని పట్టుకున్నారు. చోరీకి పాల్పడింది డేవిడ్ మిచల్ గా పోలీసులు గుర్తించారు. మరో నిందితుడు ట్రావెన్ జాన్సన్ పారిపోయాడు. కారు పైకి ఎక్కడంతో ఆ మహిళ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.
Full View