తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పే మాటలతో.. ఎక్కడికో వెళ్లిపోయే వారందరికి ‘కాగ్’ భారీ షాకిచ్చింది. తన మాటలతో ఊహాలోకాల్లో విహరింప చేస్తున్న తెలంగాణ సర్కారు లెక్కల్లోని బొక్కల్ని భారీగా ఎత్తి చూపించటమే కాదు.. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తొలి బడ్జెట్ అవాస్తవికంగా ఉందని పేర్కొనటం గమనార్హం. కాగ్ ఎత్తి చూపిన తప్పుల్ని చూసినప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ చెప్పే ‘ఘనపు’ మాటల్లో పస ఏమీ లేదని తేలిపోతుంది. తెలంగాణ సర్కారుపై కాగ్ అక్షింతల్ని చూస్తే.. మాటలకు.. వాస్తవాలకు మధ్య అంతరం భారీగా ఉందన్న విషయం అర్థమవుతుంది.
కాగ్ ఎత్తి చూపిన తప్పులు చూస్తే..
= రూ.1.01 లక్షల కోట్ల కేటాయింపుల్లో వాస్తవ ఖర్చు రూ.64,097 కోట్లు తక్కువగా ఉన్న నేపథ్యంలో రూ.5,359 కోట్ల అనుబంధ కేటాయింపులు అనవసరం.
= 2015 మార్చి 31 నాటికి 109 ప్రాజెక్టులు పూర్తి కావాల్సి ఉంది. కానీ.. కాలేదు. దీంతో వీటి అంచనాలు రూ.28,718 కోట్ల నుంచి సవరణలతో రూ.42,074 కోట్లకు చేరాయి. సకాలంలో ప్రాజెక్టులు పూర్తి కాకపోవటంతో ఖర్చురూ.13,356 కోట్లకు పెరిగింది.
= రూ.1804.79 కోట్ల మేరకు చెల్లింపులకు సంబంధించిన 47,198 ఓచర్లు ఖజానా నుంచి అందలేదు.
= వివిధ పథకాలకు విధివిధానాలు ఖరారు కాకపోవటంతో ప్రభుత్వం తీసుకున్న పలు విధాన నిర్ణయాలు నెరవేరలేదు.
= శాసనసభకు సంబంధం లేకుండా రూ.304కోట్ల మేర అదనపు వ్యయం చేశారు.
= నిర్దిష్టమైన ఖర్చుల వివరాలు లేకుండా రూ.2,555 కోట్లను కేటాయించి.. ఏడాది చివర్లో తిరిగి అప్పగించారు.
= ప్రభుత్వం అభివృద్ధి వ్యయానికి ప్రాధాన్యత ఇచ్చినా కేటాయించిన నిధులను ఆశించిన ప్రయోజనాలకు పూర్తిగా విడుదలయ్యేలా చూడలేదు.
= విద్యారంగానికి 11.57 శాతం కేటాయించారు. కానీ.. మిగిలిన రాష్ట్రాల సగటు 16.23 శాతం కంటే తక్కువ.
= మిగిలిన రాష్ట్రాల్లో సామాజిక రంగంపై 36.5 శాతం ఖర్చుతో పోలిస్తే తెలంగాణలో ఈ రంగంపై పెట్టిన ఖర్చు 34.42 శాతం మాత్రమే.
= రెవెన్యూ మిగులును ఎక్కువ చేసి చూపించారు.
= బడ్జెట్ లో ఏకంగా రూ.690.27 కోట్లు మిగులు చూపారు.
= రూ.553 కోట్ల విలువైన లావాదేవీలను తనిఖీ చేయగా.. రెవెన్యూ రాబడులను ఎక్కువ చేసిన చూపినట్లుగా వెల్లడైంది.
= పే అండ్ అకౌంట్స్ కార్యాలయాలపై తనిఖీలు లేవు. ఆర్థిక నియంత్రణలో లోపాలున్నాయి.