సర్వోన్నత న్యాయస్థానికి -కోల్ కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్ కు మధ్య సాగుతున్న అనూహ్యమైన వివాదంలో మరో పరిణామం చోటుచేసుకుంది. కోర్టు ధిక్కరణ కేసు ఎదుర్కొంటున్న జస్టిస్ కర్ణన్ కు మే 4వ తేదీన వైద్య పరీక్షలు నిర్వహించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ వైద్యుల రిపోర్ట్ ను మే 8వ తేదీన డాక్టర్లు సుప్రీంకోర్టుకు సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జస్టిస్ కర్ణన్ వైద్య పరీక్షలను తిరస్కరించారు. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇవాళ కోల్‌కతాలో జస్టిస్ కర్ణన్ కు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వ అధికారులు ప్రయత్నించారు. అంతేకాకుండా సుప్రీంకోర్టు ఆదేశాలను ఆయన తప్పుపట్టారు. పిచ్చి జడ్జిలు ఇచ్చిన పిచ్చి ఆదేశాలంటూ విమర్శించారు. తాను మెంటల్ గా ఫిట్ గా ఉన్నట్లు ఆయన చెప్పారు. తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
కాగా, వివాదాస్పద కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్ కు ప్రభుత్వ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు మే ఒకటిన ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కేసు ఎదుర్కొంటున్న జస్టిస్ కర్ణన్ మానసిక స్థితిపై నివేదిక ఇవ్వాలని కోర్టు తన తీర్పులో వెల్లడించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖేల్కర్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. కోల్ కతా ప్రభుత్వ వైద్యులు మే 4వ తేదీని జస్టిస్ కర్ణన్ కు వైద్య పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేయాలని పశ్చిమ బెంగాల్ పోలీస్ ఛీఫ్ కు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
గతంలో జస్టిస్ కర్ణన్ దేశవ్యాప్తంగా జారీ చేసిన ఆదేశాలను కూడా రద్దు చేయాలని ఏడుగురు సభ్యులు ధర్మాసనం అభిప్రాయపడింది. సుమారు 20 మంది జడ్జిలు అవినీతికి పాల్పడ్డారంటూ గత ఏడాది జస్టిస్ కర్ణన్ ఆరోపణలు చేశారు. న్యాయవ్యవస్థలో అవినీతి పేరుకుపోయిందని కూడా ఆయన ఆరోపించారు. ఈ కేసులో జస్టిస్ కర్ణన్ పై కోర్టు ధిక్కరణ కేసు నమోదు అయ్యింది. ఈ ఏడాది మార్చి నెలలో ధిక్కరణ కేసులో జస్టిస్ కర్ణన్ సుప్రీం ముందు హాజరయ్యారు. ధిక్కరణ కేసుకు స్పందించకుండానే, సుప్రీం బెంచ్ లో ఉన్న ఏడుగురు న్యాయమూర్తులకు సమన్లు కూడా జారీ చేశారు. ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖేహర్ తో పాటు ఆరుగురు జడ్జిలు తన ముందు హాజరుకావాలంటూ మరో వివాదాస్పద ఆదేశం కూడా జస్టిస్ కర్ణన్ జారీ చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/