నాకు కరోనాను సోకింది అందరికీ అంటిస్తా..వీడియో వైరల్!

Update: 2020-04-08 13:30 GMT
కరోనా వైరస్ .. ప్రస్తుతం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. దీనితో ప్రపంచంలోని మెజారిటీ దేశాలు లాక్ డౌన్ ను విధించాయి. ఈ విషయం పక్కన పెడితే .. కొంతమంది కరోనా పై రకరకాలైన వీడియోలు చేసి - సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు. వాటిని ఫాలో అవుతూ కొంతమంది తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ తరుణంలోనే తాజాగా మరో వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. తనకి కరోనా ఉందని , అది అందరికీ అంటిస్తానని ఓ 18 ఏళ్ల యువతి ఒక వీడియోని పోస్ట్ చేయగా ..క్షణాల వ్యవధిలోనే ఈ వీడియో వైరల్ అయ్యింది.

దీనిపై వెంటనే రియాక్ట్ అయిన పోలీసులు ఆ యువతి అడ్రస్‌ ను కనుగొని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన టెక్సాస్ లో జరిగింది. ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే... డల్లాస్‌ కు చెందిన లొర్నైన్‌ మరదియాగ అనే యువతి ఇటీవల స్నాప్‌ చాట్‌ లో కొన్ని వీడియోలు పోస్ట్ చేసింది. అందులో ఒక వీడియో లో  తనకు కరోనా పాజిటివ్‌ అని తేలింది అని, ఈ వైరస్‌ ను అందరికీ అంటిస్తా అని చెప్పింది. ”నేను వాల్‌ మార్ట్‌ కు వెళుతున్నా.. అక్కడ అందరికీ నేను వైరస్‌ ను అంటిస్తాను. ఎందుకంటే నేను పోతే.. మీరు కూడా పోతారు” అని కామెంట్లు కూడా  చేసింది. అలాగే మరికొన్ని అసభ్యకర వ్యాఖ్యలు కూడా చేసింది. అలాగే మరో వీడియోలో  పలుమార్లు దగ్గుతూ కూడా కనిపించింది.

ఇప్పటికే అమెరికాలో కరోనా పంజా విసురుతుంది. ఈ సమయంలో ఈ వీడియోలు వైరల్ అవ్వడంతో ..ఆమెను వెంటనే పట్టుకున్న కరోల్టన్ పోలీసులు సిటీ జైల్‌ కు తరలించారు. ఇక ఈ విషయంపై ఓ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. ”తనకు కరోనా నెగిటివ్‌ ఉన్నట్లు మరదియాగ చెప్తోంది. ఆమెకు పాజిటివ్‌ వచ్చినట్లు మా దగ్గర కచ్చితమైన ఆధారాలు లేవు. వీడియోలు క్లారిటీగా లేకపోవడంతో.. ఆమె చెప్పిన వివరాలపై ప్రత్యేక దృష్టిని సారించాం. ప్రస్తుతం  21 రోజుల పాటు మరదియాగను కస్టడీలో ఉంచబోతున్నాం” అని తెలిపారు. అలాగే , టెక్సాస్ చట్టాల ప్రకారం ఆ యువతిపై 22.0(a)(5)సెక్షన్‌ ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
Tags:    

Similar News