తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ ... ఈ పేరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫెమస్. ప్రముఖ ఛానల్ వచ్చే ప్రొగ్రాం పేరునే తన పేరుగా మార్చుకొని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ మద్యే నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా ఓట్లు సాధించి...అధికార టీఆర్‌ఎస్ పార్టీకి తీన్మార్ మల్లన్న చుక్కలు చూపించారు. చివరి వరకు పోరాడినా ఓటమి మాత్రం తప్పలేదు.
ఇదిలా ఉంటే..చింతపండు నవీన్ కుమార్ పై హైదరాబాద్ లో కేసు నమోదైంది. సీతాఫల్‌మండి డివిజన్ మధురానగర్ కాలనీలో మారుతి సేవా సమితి పేరిట లక్ష్మీకాంత శర్మ అనే జ్యోతిష్యుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలగూడ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ నెల 19న తీన్మార్ మల్లన్న తనకు ఫోన్ చేసి బెదిరించాడని, రూ.30 లక్షలు ఇవ్వకపోతే తనపై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తానని బ్లాక్‌మెయిల్ చేశాడని లక్ష్మీకాంత శర్మ చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను డబ్బులు ఇవ్వనని చెప్పడంతో ఈ నెల 20వ తేదీన తనపై తప్పుడు కథనాలు ప్రచురించి తన పరువుకు భంగం కలిగేలా చేశాడని 22వ తేదీన లక్ష్మీకాంత శర్మ పోలీసులకు ఫిర్యాదు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. దీంతో చిలకలగూడ పోలీసులు తీన్మార్ మల్లన్నపై ఐపీసీ 387, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.