కేంద్ర బడ్జెట్: ధరలు పెరిగేవి? తగ్గేవి ఇవే

Update: 2020-02-01 10:52 GMT
దేశాన్ని ఆర్థిక మాంద్యం చుట్టు ముట్టిన వేళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ శనివారం పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆర్థిక మాంద్యాన్ని ఒడ్డున పడేసేలా వ్యవసాయం, మౌళిక సదుపాయాలకు పెద్దపీట వేశారు.

తాజాగా ఆర్థిక మంత్రి నిర్మల ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో కస్టమ్స్ డ్యూటీని భారీగా పెంచారు. దీంతో ఫర్నీచర్, చెప్పుల ధరలు పెరగనున్నాయి. అదే విధంగా ఎక్సైజ్ డ్యూటీ కూడా పెంచడం తో సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల ధరలు సైతం పెరగనున్నాయి.

పత్రికల కు భారంగా మారిన విదేశాల నుంచి దిగుమతి చేసుకునే న్యూస్ ప్రింట్ పై కేంద్రం పన్ను తగ్గించింది. వైద్యపరికరాలపై 5శాతం సుంకం విధించింది. ఆటోమొబైల్ విడి భాగాలపై పన్ను పెంచింది. మొబైల్ ఫోన్ల విడి బాగాలకు పన్ను తగ్గించింది.

* బడ్జెట్ ప్రకారం ధరలు తగ్గేవి ఇవే..
విదేశాల నుంచి పత్రికలు దిగుమతి చేసుకునే న్యూస్ ప్రింట్
ఎలక్ట్రిక్ వాహనాలు
మొబైల్ ఫోన్ల విడిభాగాలు
ప్లాస్టిక్ ఆధారిత ముడిసరుకు

*బడ్జెట్ ప్రకారం పెరిగేవి ఇవే..
కమర్షియల్ వాహనాల విడిభాగాలు
సోయా ఫైబర్, ప్రొటీన్
కాపర్, స్టీల్, క్లే ఐరన్
కిచెన్ లో వాడే వస్తువులు
పొగాకు ఉత్పత్తులు
వైద్య పరికరాలు
సిగరెట్లు, చెప్పులు, ఫర్నీచర్


Tags:    

Similar News