హైదరాబాద్ ని సైబరాబాద్ గా, హైటెక్ సిటీగా డెవలప్ చేశాను అని చెప్పే చంద్రబాబు నాయుడు.. తన హైటెక్ దృష్టిని ఇప్పుడు ఏపీ రాజధాని విజయవాడపై పెట్టారు. ఈరోజు విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ప్రారంభించి బాబులోని విలక్షణతను చాటుకున్నాడు. భారీ భవంతులు, బిల్డింగులు ఓవైపు, చుట్టూ పచ్చదనం మరోవైపు ఉండాలన్నది బాబు ప్లాన్. ఆలోచన వచ్చిందే తడవుగా హరితహారం అమలైపోయింది. స్టేడియంలో బాబు ముచ్చటిస్తూ... పచ్చని మొక్కలు చాలా అవసరం. చెట్లు భవిష్యత్‌ని బాగు చేస్తాయి. వాతావరణాన్ని సమతుల్యంగా ఉంచుతాయి. వర్షం కురిసి నీళ్లు వస్తాయి. అప్పుడే అభివృద్ది. చెట్లు పెంచడం సామాజిక బాధ్యత. ప్రతి ఒక్కరి కర్తవ్యం. 5 కోట్ల జనాభా ఒక్కొక్కరు 10 చెట్లు నాటితే 50 కోట్ల చెట్లు నాటినట్టే.
పదేళ్లలో 500 కోట్ల చెట్లు నాటాలి... అని బాబు పిలుపునిచ్చారు. అందుకే మొక్కలు నాటిన వారికి గుర్తింపు కోసం వారి ఫోటోల్ని ఆ మొక్కలకు తగిలిస్తామని అన్నారు. విజయవాడ, గుంటూరులో వేసవి ఉష్టోగ్రత తగ్గించాలంటే ఇది కచ్చితంగా పాటించాలన్నారు. అమరావతి పరిసరాల్లో కొండలపై హెలీకాఫ్టర్లతో విత్తనాలు చల్లి మొక్కలు మొలిపించడానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని, ఈ వారంలో ఆ పని పూర్తవుతుందన్నారు.
ఇది సరే గానీ ఈ ఏడాది వర్షాలు లేవు. ఈ నేపథ్యంలో ఇలా చల్లిన విత్తనాలు సరిగా మొలకలెత్తి వృక్షాలవుతాయా? లేదా? అన్నది ఒక అనుమానం. మరి ప్రకృతి సాయం ఎంత మేరకు ఫలితం అంత మేరకు ఉంటుంది.