స్నేహంగా ఉన్నంత కాలం అంతా బాగున్నట్లే అనిపిస్తుంది. అప్యాయంగా పలకరించుకోవటాలు.. నవ్వుకోవటాలు.. కరచాలనాలు చేసుకోవటాలు అన్ని ఉంటాయి. కానీ.. లెక్కలు తేడా వస్తేనే అసలు కథ మొదలవుతుంది. అయితే.. ఇలాంటి వాటి వల్ల నష్టమే తప్ప లాభం ఉండదు. ఇక.. పెద్దన్న లాంటి కేంద్రంతో తగువు పెట్టుకుంటే జరిగే నష్టం ఎలా ఉంటుందో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియంది కాదు. అలా అని మౌనంగా ఉంటే మొదటికే మోసం వస్తుందన్నది బాబుకు తెలిసిందే. అందుకే.. మాట జారకుండానే మోడీ అండ్ కోకు చుక్కలు చూపించే వ్యూహాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధం చేశారు.
విబజన సందర్భంగా ఇచ్చిన హామీల్లో ముఖ్యమైన ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ఇచ్చేది లేదని కేంద్రం తేల్చేసిన నేపథ్యంలో.. హడావుడి మాటలు.. భావోద్వేగ బెదిరింపుల కంటే కూడా అంకెలతో హుందాగా దెబ్బ కొట్టాలన్న ఆలోచనతో బాబు ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి తగ్గట్లే తన వాదనను సిద్ధం చేసుకున్నట్లు చెబుతున్నారు. పేరుకు మిత్రుడే అయినా కేంద్రంలో మోడీ సర్కారు ఏపీకి చేసిందేమీ లేదన్న విషయాన్ని అందరికి అర్థమయ్యేలా చేయాలన్న ఆలోచనలో ఉన్న బాబు .. ఏం చేశారన్న విషయంపై లెక్కలు సిద్ధం చేశారు. ఏపీకి చాలా చేశామని తరచూ చెప్పుకునే కమలనాథుల నోటి నుంచి మాట రాని విధంగా లెక్కల్ని సిద్ధం చేసిన బాబు దెబ్బతో మోడీ పరివారానికి మాట రాకుండా చేయటం ఖాయంగా చెప్పొచ్చు. ఏపీకి కేంద్రం ఏం ఒరగబెట్టిందన్న విషయం ఇట్టే అర్థమయ్యేలా తయారు చేసిన లెక్కలు స్పష్టం చేస్తున్నారు.
ఈ లెక్కల్ని చూస్తే ఏపీ పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరించటమే కాదు.. తమకేమాత్రం మిత్రుడి కాని తెలంగాణ రాష్ట్రం పట్ల మోడీ సర్కారు ప్రదర్శించిన ఔదార్యం కనిపిస్తుంది. తమ పట్ల మోడీ సర్కారు ఎంత అవమానకరంగా వ్యవహరించిందన్న విషయాన్ని అర్థమయ్యేలా చేయాలన్న ఆలోచనలో బాబు ఉన్నారన్న విషయం తాజాగా తయారు చేసిన లెక్కల వైనాన్ని చూస్తే ఇట్టే అర్థమవుతంది.
2014 – 15 అపాయింటెడ్ డేట్ నుంచి ఇప్పటివరకూ ఏపీకి కేంద్రం అందించిన సాయం కేవలం రూ.6088 కోట్లుమాత్రమేనని ఏపీ అధికారులు లెక్కలు తేల్చారు. అంతేకాదు కరువు సాయం విషయానికి వస్తే తెలంగాణలోని ఏడు జిల్లాలకు రూ.791 కోట్లు కేటాయిస్తే.. ఏపీలోని పది జిల్లాల కరువు కోసం కేంద్రం విదిల్చింది కేవలం రూ.433 కోట్లు మాత్రమే కావటం గమనార్హం. ఇదే కాదు..విభజన చట్టం ప్రకారం భారీ పరిశ్రమల్ని ఏపీలో ఏర్పాటు చేయాల్సి ఉన్నా రెండేళ్లలో చేసిందేమీ లేదు.
విభజన చట్టం ప్రకారం కొత్త రాజధానిలో అత్యవసర సదుపాయాల ఏర్పాటు కోసం కేంద్రం ప్రత్యేక ఆర్థిక సాయం చేయాలి. మౌలికసదుపాయాల కోసం మొదట రూ.1500 కోట్లు.. రాజ్ భవన్.. హైకోర్టు. ఇతర అత్యవసర మౌలికసదుపాయాల కోసం రూ.350 కోట్లు విడుదల చేసింది. ఇక.. 2016-17 బడ్జెట్ లో అమరావతికి నిధులు కేటాయించలేదు. విభజన చట్టంలోని 46(2) ప్రకారం విభజన కారణంగా ఏపికి తలెత్తే వనరుల కొరతను కేంద్రమే భర్తీ చేయాలి. రాష్ట్ర విభజన తర్వాత రెవెన్యూ లోటు రూ.16,200 కోట్లు అని లెక్క తేలిస్తే.. కేంద్రం నుంచి వచ్చింది రూ.2803 కోట్లు మాత్రమే కావటం గమనార్హం. ఈ లోటు ఖాతా కింది కేంద్రం నుంచి ఇప్పటికి రూ.13,897 కోట్లు రావాల్సి ఉంది. తాజా బడ్జెట్ లో దీనికి సంబంధించి కేంద్రం ఒక్క రూపాయి కేటాయించలేదు.
విభజన చట్టంలోని 46(3) ప్రకారం రాష్ట్రంలో వెనుకబడినజిల్లాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ అందజేయాలి. ఇందులోభాగంగా ఏపీ రూ.24,350 కోట్ల సాయాన్ని కేంద్రాన్ని కోరితే.. మోడీ సర్కారు విదిల్చింది ఇపటివరకూ రూ.700 కోట్లు మాత్రమే. తాజా బడ్జెట్ లో ఎలాంటి నిధుల్ని కేటాయించలేదు. ఇక.. ఏపీకి కీలకమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.30వేల కోట్లు అవసరమైతే ఇప్పటివరకూ రాష్ట్రానికి కేంద్రం విడుదల చేసింది రూ.735 కోట్లు మాత్రమే. తాజా బడ్జెట్ లో పోలవరం ప్రాజెక్టుకు కేటాయించింది రూ.100కోట్లు మాత్రమే. శాంపిల్ గా ఈ అంకెలు చాలు మోడీ సర్కారు ఏపీకి ఎంత సాయం చేసిందో అర్థం కావటానికి.