ఆ ఇల్లు రెండు రాష్ట్రాల్లోనూ ఉంటుంది.. నిజంగా నిజం.. ఎక్కడంటే

Update: 2022-12-17 23:30 GMT
కాస్త కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుందా? కానీ.. నిజం. ఒక ఇల్లు.. రెండు రాష్ట్రాలకు చెందుతుందంటే కాస్తంత సిత్రంగా అనిపిస్తుంది. కోట్లల్లో ఒకటి కూడా ఇలాంటి ఇంటి మాదిరి ఉండే అవకాశం ఉండదు. ఎందుకంటే.. ఇలాంటివి చాలా చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తుంటాయి.

ఇప్పుడుచెప్పే ఇంటిలాంటి ఇంటి గురించి మీరు ఇప్పటివరకు విని ఉండకపోవచ్చు. ఈ ఇంటిలో ఒక భాగం ఒక రాష్ట్రానికి చెందినదైతే.. మరో భాగం ఇంకో రాష్ట్రానికి చెందినదిగా గుర్తించారు. ఇలాంటి సిత్రమైన ఇల్లు ఎలా సాధ్యమైంది? అన్న సందేహంతో పాటు.. మరి.. ఇంటి పన్నురెండు రాష్ట్రాలకు కట్టాల్సిందే? లాంటి ప్రాక్టికల్ క్వశ్చన్లు రావటం ఖాయం.

ఇంతకూ అలాంటి సిత్రమైన ఇల్లు ఎక్కడ ఉంది? ఎలా ఉందన్న విషయంలోకి వెళితే.. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో ఇలాంటి ఇల్లు ఒకటి ఉంది. ఈ రెండు రాష్ట్రాల సరిహద్దు గ్రామం మహారాజగూడ. ఇది మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా కిందకు వస్తుంది.

ఈ ఇంట్లో మొత్తం 10 గదులు ఉంటాయి. దీనికి ఇద్దరు అన్నదమ్ములు యజమానులు. మొత్తం ఈ ఇంట్లో 13 మంది కుటుంబ సభ్యులు ఉంటారు. మొత్తం పది గదుల్లో నాలుగు గదులు తెలంగాణ రాష్ట్రానికి.. మరో నాలుగు గదులు మహారాష్ట్రకు వస్తాయి.

ఈ కారణంతోనే సదరు కుటుంబం వారు రెండు రాష్ట్రాలకు ఆస్తిపన్ను చెల్లిస్తుంటారు. మరి.. భారం కాదా? అంటే.. దాని గురించి పెద్దగా వారు బాధపడటం కనిపించదు. ఇంతకూ ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే.. 1969లో మహారాష్ట్ర.. తలెంగాణ రాష్ట్ర సరిహద్దు వివాదాన్ని పరిష్కరించిన వేళకు.. వీరి ఇల్లు రెండు రాష్ట్రాల కిందకు వస్తుందన్న విషయాన్ని గుర్తించారు. అప్పటి నుంచి వారు రెండు రాష్ట్రాలకు ఇంటి పన్ను కట్టేందుకు సిద్ధమయ్యారు.

అలా ఆ ఇంట్లో ఉంటున్న వారిని చూస్తే.. ఉదయం ఒక రాష్ట్రంలో భోజనం చేసి.. రాత్రి అయ్యేసరికి మరో రాష్ట్రంలో ఉన్న బెడ్రూంలో పడుకుంటారని చెప్పాలి. మొత్తం పది గదుల్లో ఎనిమిది గదుల్ని వినియోగిస్తుంటారు. అందులో వంట గది మాత్రం తెలంగాణలో ఉందని చెబుతారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ స్పెషల్ ఇంటికి రెండు రాష్ట్రాల సంక్షేమ పథకాలు అందుతుండటం అభినందించాల్సిందే. అదే సమయంలో రెండు రాష్ట్రాలకు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టేందుకు వెనకాడకపోవటం ఈ ఇంటి యజమానుల్లో కనిపిస్తూ ఉంటుంది. నిజంగానే విచిత్రమైన విషయం కదా?



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News