భాషను కోల్పోవడం అంటే సంస్కృతిని కోల్పోవడమే అని అన్నారు సీజేఐ ఎన్వీ రమణ. ఓయూ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన నిన్నటి వేళ ఆలోచింపజేసే రీతిలో మన మూలాలను, సంస్కృతిని ప్రభావితం చేసే నాలుగు మంచి మాటలు చెప్పారు. ముఖ్యంగా ప్రపంచీకరణతో స్థానిక సంస్కృతులకు పెను ముప్పు వాటిల్లుతోందని ఆవేదన చెందారు.
మాతృ భాషలకు సంబంధించి కూడా ఇప్పటిదాకా ఉన్న నివేదికలు అన్నీ ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మనం మాట్లాడుతున్న భాష తరువాత తరం మాట్లాడక పోతే, రాయకపోతే , వ్యవహరించకపోతే అది మృత భాషే అవుతుంది.
ఇదే సమయంలో యునెస్కొ 2 021 నివేదిక కూడా ఈ శతాబ్దం చివరలో ఏడు వేల భాషలు అంతర్థానం అవుతాయి అని చెబుతోందని, ఇది తీవ్ర ఆందోళనకు కారణం అయ్యే పరిణామమే అని చెప్పారు ఎన్వీ.
మనం భాషను కోల్పోతే సాహిత్యాన్నే కాదు జాన పద వాంగ్మయాన్నే కాదు ఇంకా సంస్కృతిని కూడా కోల్పోతాం.. సంబంధిత విజ్ఞానాన్ని కూడా కోల్పోతాం.. అని చెప్పారు ఎన్వీ .
ఓయూ స్నాతకోత్సవాల్లో భాగంగా ఇక్కడికి విచ్చేసిన ఎన్వీ కి వర్శిటీ తరఫున గౌరవ డాక్టరేట్ ను ఛాన్సలర్ హోదాలో గవర్నర్ తమిళ సై ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ఎన్వీ మాట్లాడుతూ... శాస్త్ర సాంకేతిక రంగాల పురోగతి కారణంగా మనం ప్రపంచ సంస్కృతి వైపు వేగంవేగంగా అడుగులు వేస్తున్నామని, కానీ ఇదే సందర్భంలో స్థానిక సంస్కృతులను మరిచిపోతున్నామని, ఇటు వంటి క్లిష్ట సందర్బంలో స్థానిక సంస్కృతులను పదిలపర్చుకునేందుకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ఇరు తెలుగు ప్రాంతాల ప్రజలకు పిలుపునిచ్చారు. అదేవిధంగా విద్యార్థులకు ప్రాథమిక న్యాయ సూత్రాలపై అవగాహన కల్పించాలని కోరారు.