తెలంగాణలో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కు ముచ్చటగా మూడోసారి గెలుపు అంత ఈజీ కాదు. అందుకే ప్రభుత్వ వ్యతిరేకతతో పోయే ఓట్లను పొత్తులతో సాధించేందుకు నడుం బిగించారు. అందుకే కమ్యూనిస్టులను కూడా వదలకుండా పొత్తు పెట్టుకుంటున్నారు. తాజాగా సీపీఐ, సీపీఎంలతో పొత్తుపై కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు.
మునుగోడుతోపాటు వచ్చే ఎన్నికల్లో సీపీఐతో కలిసి వెళతామని కేసీఆర్ స్పష్టం చేశారు. సీపీఎంతో కూడా పొత్తు పెట్టుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ 2 పార్టీలకు కలిపి 2 ఎంపీ, 10 ఎమ్మెల్యే సీట్లు కేటాయించనున్నారని సమాచారం. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో 2-3 శాతం ఓట్లు కూడా వదలుకునేందుకు కేసీఆర్ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది.
తెలంగాణలో కమ్యూనిస్టులకు ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో ఓటు బ్యాంక్ ఉంది. మునుగోడులో గతంలో ఐదు సార్లు సీపీఐ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. కానీ ఇప్పుడా పార్టీకి మునుగోడులో ఓటు బ్యాంకు కాస్తో కూస్తో ఉన్నా గెలిచే స్థాయిలో బలం లేదు. నాయకులు లేరు.అందుకే ఇతర పార్టీల చెట్టు నీడలో కాస్తైన బతకాలని కమ్యూనిస్టులు ఆరాటపడుతున్నాయి. కేసీఆర్ పిలుపునివ్వగానే వాలిపోయి పొత్తు కోసం వెంపర్లాడుతున్నాయి.
ఇదే కమ్యూనిస్టులను కేసీఆర్ గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని ముందుకెళ్లినప్పుడు 'తోకపార్టీలు..సూది దబ్బుణం' పార్టీలు అని ఎద్దేవా చేశారు. కానీ కాంగ్రెస్ మాత్రం ఇటు పొత్తు పెట్టుకొని కమ్యూనిస్టులకు కేటాయించిన సీట్లలో తమ కాంగ్రెస్ నేతలకు టికెట్ ఇచ్చి నిలబెట్టింది. కాంగ్రెస్ మోసం చేసిందనే ఇప్పుడు టీఆర్ఎస్ పంచన నేరి ఆయన ఇచ్చే సీట్ల కోసం కమ్యూనిస్టులు పార్టీలు కక్కుర్తి పడుతున్నాయని సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.
మునుగోడులో బలంగా ఉన్న కమ్యూనిస్టుల ఓటును మళ్లించుకోవాలనే కేసీఆర్ ఇలా వాటితో పొత్తు కు రెడీ అయ్యారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మళ్లీ బలం పెరిగితే ఇదే కమ్యూనిస్టులను తీసిపారేస్తారు. కేసీఆర్ తీరు తెలిశాక కూడా ఆయనతో పొత్తుకు రెడీ అయ్యారు కమ్యూనిస్టులు. ఈ పొత్తు కలకాలం ఉంటుందా? లేదా? అన్న దానికి కాలమే సమాధానం చెబుతుంది.