ఏదైనా అంశాన్ని తీసుకుంటే దాని లోతుల్లోకి వెళ్లటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అలవాటు. ఒక విషయంలో ఫిక్స్ అయ్యాక.. దాని చుట్టూనే ఆయన తిరగటమేకాదు.. దానికిచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. మాజీ ప్రధాని పీవీని తమ పార్టీకి దఖలు చేసుకునే విషయంలో కేసీఆర్ వ్యవహరిస్తున్న వైనం ఇటీవల కాలంలో ఆసక్తికరంగా మాత్రమే కాదు.. హాట్ టాపిక్ గా మారింది. భవిష్యత్తు రాజకీయాలకు ఇదో మార్గంగా మారుతుందన్న మాట కూడా పలువురి నోట వినిపించింది.
అయితే.. కేసీఆర్ చేస్తున్న పీవీ భవన మూణ్ణాళ్ల ముచ్చటగా అభివర్ణించే వారు లేకపోలేదు. ఇలాంటివారంతా తమ ఆలోచనల్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని తాజాగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల్ని చూస్తుంటే అర్థం కాక మానదు. కొద్ది వారాల క్రితం పీవీ శతజయంతి ఉత్సవాల్ని ఏ తీరులో నిర్వహించాలన్న అంశంపై సుదీర్ఘంగా రివ్యూ నిర్వహించటం.. ఆ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకోవటం.. ఏడాది మొత్తం నిర్వహించాల్సిన కార్యక్రమాలకు సంబంధించిన క్యాలండర్ సిద్ధం చేయటం తెలిసిందే.
ఇందులో భాగంగా వీవీ శతజయంతి ఉత్సావాల ఓపెనింగ్ సైతం భారీగానే నిర్వహించారు. ఇక్కడితో ఒక పని పూర్తి అయ్యిందని భావించారు. కానీ.. ఈ అంశాన్ని రానున్న రోజుల్లో మరెంత ముందుకు తీసుకెళతారన్న విషయం అందరికి అర్థమయ్యేలా తాజాగా మరిన్ని నిర్ణయాల్ని ప్రకటించారు కేసీఆర్. నెక్లెస్ రోడ్ కు పీవీ జ్ఞానమార్గ్‌గా పేరు పెట్టటంతో పాటు.. హైదరాబాద్ లో పీవీ మెమోరియల్ నిర్మించనున్నట్లు చెప్పారు. తాజాగా నిర్వహించిన రివ్యూలో పీవీని ఆకాశానికి ఎత్తేసిన కేసీఆర్.. రానున్న అసెంబ్లీ సమావేవాల్లో పీవీకి భారత రత్న ఇవ్వాలన్న అంశంపై తీర్మానం చేస్తామన్నారు. అసెంబ్లీలో పీవీ పోట్రెయిట్ పెట్టాలని డిసైడ్ చేసినట్లు చెప్పారు.
భారత పార్లమెంటులో కూడా పీవీ పొట్రెయిట్ పెట్టాలని కేంద్రాన్ని కోరతామని.. హైదరాబాద్ లోని సెంట్రల్ యూనివర్సిటీకి పీవీ పేరు పెట్టాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయనున్నట్లుచెప్పారు. మొత్తానికి తన ఆలోచనలన్ని పీవీ చుట్టూ ఎంతలా ఉన్నాయన్న విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తాజా రివ్యూతో చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.