పోలింగుకు ముందు జగన్మోహన్ రెడ్డి అనవసరంగా గోక్కుంటున్నాడా ? అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉగాది పండుగ సందర్భంగా గ్రామ, సచివాలయ వాలంటీర్లను సన్మానించాలని జగన్ డిసైడ్ చేశారు. ఏడాదికాలంగా మూడు అంశాల్లో విశిష్టసేవలను అందించిన వాలంటీర్లను గుర్తించి సన్మానం చేయాలన్నది జగన్ ఆలోచన. ఇందుకోసం రూ. 229 కోట్లను మంజూరుచేసింది కూడా.
ఉత్తమసేవలను అందించిన వారిని సన్మానించటం ద్వారా వాలంటీర్లను మరింతగా ప్రోత్సహించినట్లు ఉంటుందన్నది జగన్ ఆలోచన కావచ్చు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి వ్యవహారం రివర్సులో నడిచే ప్రమాదమే ఎక్కువగా కనబడుతోంది. చెప్పటమేమో అందరినీ సన్మానిస్తామని చెప్పినా ఆచరణలో సాధ్యమయ్యేది కాదు. కాబట్టి మొదట్లో కొందరికి సన్మానం జరిగిన తర్వాత కార్యక్రమంలో ఊపుతగ్గిపోతుంది.
మొదట్లో ఎవరైతే సన్మానం చేయించుకుంటారో వారు ఉత్సాహంగా పనిచేయచ్చు కానీ మిగిలిన వారి సంగతేమిటి ? పదిమందికి సన్మానం జరిగితే వందమంది వ్యతిరేకమయ్యే ప్రమాదముంది. మరి ఈ విషయాన్ని ప్రభుత్వం ఆలోచించలేదా ? అనేదే ఇపుడు చాలామందిని వేధిస్తున్న ప్రశ్న. ఉత్తమసేవలు అందించిన అనగానే మళ్ళీ ఎంఎల్ఏలు, మంత్రులు లేదా సీనియర్ నేతల రికమెండేషన్ల కోసం పోటీలుపడే అవకాశం కూడా ఉంది. దీనివల్ల వాలంటీర్ల మధ్య అనారోగ్యకర పరిస్ధితులు తలెత్తటానికే అవకాశాలు ఎక్కువగా ఉంది.
ఇంతోటి తలనొప్పి సన్మాన కార్యక్రమానికి ప్రభుత్వం 229 కోట్ల రూపాయలు మంజూరు చేసేబదులు ఆ మొత్తంతో వారికి జీతాలు పెంచితే సంతోషిస్తారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశించి జగన్ బలమైన వాలంటీర్ల వ్యవస్ధను ఏర్పాటు చేశారు. వాళ్ళతో సక్రమంగా పనిచేయించుకుంటే మంచిదే. కానీ ఇలాంటి సన్మాన కార్యక్రమాల పేరుతో అనవసరంగా జగన్ గోక్కుంటున్నాడేమో అనే చర్చ కూడా మొదలైంది. మరి దీని పర్యవసానం ఎలాగుంటుందో చూడాల్సిందే.