మీకు ఎంతోమంది కలెక్టర్లు తెలిసి ఉండొచ్చు. కానీ.. ఇప్పుడు మేం చెప్పే కలెక్టర్ గురించి వింటే మాత్రం మీరు ఆశ్చర్యపోతారు. ఇలాంటి కలెక్టర్లు కూడా ఉంటారా? అని విస్మయానికి గురి అవుతారు. కలెక్టర్ స్థాయిలో ఉండి కూడా ఒక సామాన్యుడి కోసం ఆయన చేసిన పని తెలిశాక ఆయనకు ఫిదా అయిపోవటం ఖాయం. ఇంతకీ ఆయనేం చేశారంటారా? అక్కడికే వస్తున్నాం.
పైన మీరు చూస్తున్న ఫోటోలో పెళ్లికి కారును ముస్తాబు చేసినట్లుగా ఉంది కదా. ఇంతకీ ఆ కారు ఎవరిదంటే ఆకోలా ప్రాంతానికి కలెకర్ట్ అయిన శ్రీకాంత్ ది. ప్రభుత్వం ఆయనకు కారును.. ఒక డ్రైవర్ ను ఇచ్చింది. అయితే.. ఆయన డ్రైవర్ దిగంబర్ థక్ రిటైర్ అయ్యే రోజు వచ్చింది. ఆయన కెరీర్ లో మొత్తం 18 మంది కలెక్టర్లకు డ్రైవర్ గా విధులు నిర్వహించారు. తన వృత్తిలో భాగంగా ఏ రోజు ఎలాంటి తప్పు చేయలేదు. అలాంటి వ్యక్తి రిటైర్మెంట్ నుకాస్తంత డిఫరెంట్ గా నిర్వహించాలని డిసైడ్ అయ్యారు కలెక్టర్ శ్రీకాంత్.
అంతే.. ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి. ఇంతకాలం కలెక్టర్ కు డ్రైవర్ గా సేవలు అందించిన దింగర్ చివరి పని దినాన ఆయన్ను అధికారిక కారులో వెనుక కూర్చొబెట్టుకొని కలెక్టర్ శ్రీకాంత్ స్వయంగా కారు నడిపారు. అంతేకాదు.. చివరి రోజు ఆఫీసులో భారీ వీడ్కోలు సభను ఏర్పాటు చేశారు. ఒక కలెక్టర్ అయి ఉండి.. తన కారు డ్రైవర్ రిటైర్మెంట్ రోజున తానే స్వయంగా ఆయన్ను తన కారులో కూర్చొబెట్టుకొని.. ఆ కారును తానే స్వయంగా డ్రైవ్ చేయటం అందరిని విపరీతంగా ఆకర్షించటమే కాదు.. కలెక్టర్ శ్రీకాంత్ సింప్లిసిటీ అందరి మనసుల్ని విపరీతంగా దోచేసింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/