వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్స్ మీద... వైసీపీ సోషల్ మీడియా మీద సెటైర్లే సెటైర్లు!

Update: 2022-09-01 13:30 GMT
ఈ మధ్యనే వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్స్ ని కో కన్వీనర్స్ ని పెద్ద ఎత్తున‌ వేశారు. అయితే ఒరిజినల్ గా సోషల్ మీడియాలో వైసీపీ తరఫున యాక్టివ్ గా ఉన్న వారికి తెలియకుండానే చకచకా  ఈ నియామకాలు జరిగిపోయాయి అని అంటున్నారు. గుంటూరు, విజయవాడలలో   కూర్చుని ఒక వర్గం డిసైడ్ చేసి అలా ఎంపిక చేసింది అంటున్నారు. అలా వైసీపీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్స్ పదవులు పొందిన వారికి వైసీపీ పార్టీ గురించి కానీ విధానాల గురించి కానీ ప్రభుత్వ కార్యక్రమాల గురించి కానీ కనీస అవగాహన లేదని అంటున్నారు.

చిత్రమేంటి అంటే వారికి పేజ్ కి అకౌంట్ కి మధ్య తేడా కూడా తెలియదు అని అంటున్నారు. ఇక వారి ప్రోఫైల్ ఎక్కడ ఉందో కూడా వెతుక్కోవాల్సి వస్తోంది అంటున్నారు. దీంతో నిజమైన జగన్ సేన కానీ జగన్ కోసం వైసీపీ కోసం తన శ్రమను కాలాన్ని పూర్తిగా అంకితం చేసే వారు కానీ ఈ తరహా నియామకాలు చూసి వీరా సోషల్ మీడియా సైన్యం అని విస్తుపోతున్నారుట.

దాంతో తమ సొంత పార్టీ నియమించిన వారి మీదనే అదే సోషల్ మీడియాలోనే పెద్ద ఎత్తున సెటైర్లు వచ్చి పడుతున్నాయట. అంతే కాదు ఇదేమి  నియామకం అని పార్టీ పెద్దలను కూడా దుమ్మెత్తిపోస్తున్నారుట.

నిజంగా వైసీపీకి సోషల్ మీడియాను పటిష్టం చేసుకోవాలంటే ముందుగా పార్టీలో చాలా కాలంగా పనిచేస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులను దగ్గర కూర్చోబెట్టి వారి నుంచి ఎంపికలు చేసుకోవాలి. అలాగే వారికి ఉన్న ఆసక్తిని, వారికి పార్టీ పట్ల నిబద్ధతను, రాజకీయ పరిజ్ఞానాన్ని కూడా అంచనా వేసుకోవాలి. అంతే తప్ప ఇదేదో కార్పోరేట్ స్టైల్ లో ఉద్యోగాల  సెలెక్షన్ అన్నట్లుగా నియామకాలు చేస్త అసలుకే ఎసరు వస్తుంది అని అంతా అంటున్నారు.

వచ్చే ఎన్నికలు నిజంగా సోషల్ మీడియా ద్వారానే జరుగుతాయి. ట్రెడిషనల్ పాలిటిక్స్ కి పూర్తిగా  కాలం చెల్లింది.  జనాలను ఈ రోజు సోషల్ మీడియా తీవ్రంగా ప్రభావం చేస్తోంది. ఒకసారి సోషల్ మీడియా పవర్ ఏంటో దాని ఫలితాలు ఏంటో పాజిటివ్ గా రుచి చూసిన నేపధ్యం వైసీపీకి ఉంది. ఆ పార్టీ ఆ విధంగా విజయం సొంతమైంది.  అలాంటపుడు 2024 ఎన్నికల  కోసం మరింత పకడ్బంధీగా కార్యక్రమాలు  రూపొందించుకోవాలి.

అంతే తప్ప గుడ్డెద్దు చేలో పడ్డట్లుగా నియమించామంటే చేశామని  ఎవరిని పడితే వారిని నియమించడం వల్ల భారీ నష్టం పార్టీకి చేకూరుతుంది అంటున్నారు. దీని వల్ల మొదటి నుంచి పనిచేసే వారిలో నిరాశ నీరసం వస్తుంది. అదే టైమ్ లో కొత్త వారి వల్ల ఏ రకమైన పైసా ఫలితం ఉండదు, ఇలా రెండిందాల వైసీపీ నష్టపోతుంది అని అంటున్నారు. మరి ఇప్పటికైనా గుర్తెరిగి లోపాలను సవరించుకుంటారా లేదా అంటే చూడాలి మరి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News