తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ.. పార్టీని ఏర్పాటు చేసిన వైఎస్ తనయ.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలికి టైం ఏమాత్రం కలిసిరావడం లేదని అంటున్నారు పరిశీలకులు. క్షేత్రస్థాయిలో పార్టీ పుంజుకోవడం లేదు. నిజానికి పార్టి పెట్టి తక్కువ సమయమే అయినా.. ఆమె హడావుడి మాత్రమే కనిపిస్తోం ది తప్ప.. ఎక్కడా పార్టీలో నేతల హవా కనిపించడం లేదు. పైగా జిల్లా స్థాయిలో ఎక్కడా పార్టీ పుంజుకోవ డం లేదు. కొత్తగా ఎవరూ నేతలు కూడా రావడం లేదు. దీంతో పార్టీలో ఇప్పటి వరకు ఉన్న కమిటీలు కూడా సరిగా పనిచేయడం లేదని.. అందుకే ఇలాంటి పరిస్థితి వచ్చిందని షర్మిల భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే పార్టీ ఏర్పాటు చేసిన సమయంలో నియమించిన పార్లమెంటు నియోజకవర్గాలకు కోఆ ర్డినేటర్ లను, రాష్ట్రస్థాయిలో అధికార ప్రతినిధులను, సోషల్ మీడియా తో పాటుగా పలు రకాల విభాగాల ఇన్చార్జి లను తాజాగా రద్దు చేస్తున్నట్లు షర్మిల ప్రకటించారు. వారి స్థానంలో జిల్లాలకు కోఆర్డినేటర్లు నియమిస్తున్నట్లుగా వెల్లడించారు. ఈ క్రమంలో ప్రతిజిల్లాకు ఒక కోఆర్డినేటరే ఉండనున్నారు. అంటే.. మొత్తం వీరే పార్టీ కోసం పనిచేయాలన్న మాట.
తాజాగా నియమించిన కోఆర్డినేటర్ల విషయానికి వస్తే గ్రేటర్ హైదరాబాద్ కు వడుక రాజగోపాల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గడిపల్లి కవిత, వరంగల్, హనుమకొండలకు నాడెం శాంతి కుమార్, ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి గా బెజ్జంకి అనిల్ కుమార్, నిజామాబాద్ జిల్లాకు నీలం రమేష్, యాదాద్రి భువనగిరి జిల్లాకు మహమ్మద్ అత్తార్ ఖాన్, వికారాబాద్ జిల్లా కు తమ్మాలి బాలరాజు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు అప్పం కిషన్, నల్గొండ జిల్లాకు ఇంజమ్ నర్సిరెడ్డి, ములుగు జిల్లాకు రామ సహాయం శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి జిల్లాకు ఎడమ మోహన్ రెడ్డి, నారాయణపేట జిల్లాకు మడివాల కృష్ణను నూతన కోఆర్డినేటర్లు గా నియమించారు.
ఇలా.. వైఎస్సార్ టీపీలో ఒక్కసారిగా అన్ని కమిటీలను రద్దు చేసి జిల్లాల వారీగా ఇంచార్జ్ లను నియమించడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పార్టీ పెట్టిన నాటి నుంచి ఉన్న వారు ఇప్పటి వరకు పార్టీ కోసం పనిచేయలేక పోయారని.. షర్మిల భావిస్తున్నారు.
అందుకే క్షేత్రస్థాయిలో పార్టీ పుంజుకునే పరిస్తితిలో లేదని ఆమె అనుకుంటున్నట్టు విశ్లేషకుల అభిప్రాయం. నిజానికి పార్టీ పెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు గయారామ్.. అంటున్న వారే తప్ప.. ఆయారామ్.. అనేవారు లేరు. ఈ క్రమంలోనే మార్పులు చేసినట్టు చర్చ నడుస్తుండడం గమనార్హం