అఖిల ప్రియ ఇంట్లో చోరీ? పోలీసులపై ఫిర్యాదు?

Update: 2021-08-10 14:30 GMT
టీడీపీ మాజీ మంత్రి, సీనియర్ నేత భూమా అఖిలప్రియ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆమె పోలీసులపై పోలీసు స్టేషన్ లోనే ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ కూకట్ పల్లిలోని తన ఇంట్లోని పలు విలువైన పత్రాలతోపాటు కొన్ని వస్తువులను ఎత్తుకెళ్లారని ఆమె ఆరోపించారు. దీనిపై కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తన భూమి పత్రాలతోపాటు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారని ఇది బోయినపల్లి పోలీసుల పనేనని ఆరోపిస్తున్న అఖిలప్రియ ఈ ఘటనపై కూకట్ పల్లి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. తాను ఇంట్లో లేని సమయంలో కొంతమంది వ్యక్తులు తన ఇంటికి వచ్చారని ఫిర్యాదులో భూమా అఖిలప్రియ పేర్కొంది.

బోయినపల్లి పోలీసులతోపాటు పది మంది తన ఇంట్లోకి చొరబడ్డారని.. అత్యంత విలువైన పత్రాలతోపాటు తన తండ్రికి సంబంధించిన కొన్ని వస్తువులను ఎత్తుకు పోయారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇక దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, ఫొటోలతోపాటుకొన్ని వీడియోలను కూడా అఖిలప్రియ జతపరిచారు. తన ఇంట్లోకి అక్రమంగా చొరబడి పత్రాలు ఎత్తుకెళ్లారంటూ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు.

ఇక అఖిలప్రియ ఫిర్యాదుపై బోయినపల్లి పోలీసులు స్పందించారు. సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన అఖిలప్రియతోపాటు ఆమె భర్త భార్గవ్ రామ్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. భార్గవ్ రామ్ నకిలీ ఫోన్ నంబర్లు, నకిలీ నంబర్లతో ఉద్దేశపూర్వకంగా పోలీసుల నుంచి తప్పించుకుంటున్నారని.. అతడి కోసం మాత్రమే అఖిలప్రియ నివాసానికి వెళ్లామని పోలీసులు తెలిపారు.

అఖిలప్రియ చెబుతున్న ప్రకారం ఈ సంఘటన జులై మొదటి వారంలో జరిగింది. ఒక నెల తర్వాత ఆమె ఫిర్యాదు చేసింది. ఇన్ని రోజుల తర్వాత ఫిర్యాదు చేయడం సంచలనమైంది.
Tags:    

Similar News