టెస్టోస్టిరాన్‌ తో ఆయుష్ త‌గ్గి భారీ సంఖ్య‌లో క‌రోనా బాధితులుగా పురుషులు

Update: 2020-04-18 10:30 GMT
స‌హ‌జంగా మ‌నుషుల్లో పురుషుల క‌న్నా స్త్రీల జీవిత కాలం అధికంగా ఉంటుంది. పురుషులు సాధార‌ణంగా 70 ఏళ్ల‌లోపు మృతిచెందే ప‌రిస్థితులు ఉండ‌గా మ‌హిళ‌లు 80- 90 ఏళ్ల దాక.. అంత‌క‌న్నా అధికంగా బ‌తికి ఉంటారు. అది స‌హ‌జం. అందుకే గ్రామాల్లో వందేళ్లు దాటిన వృద్ధ మ‌హిళ‌లు ఉండ‌డం చూస్తున్నాం. అయితే దానికి కార‌ణ‌మేమిటంటే స్త్రీల్లో ఉండే జీన్స్ కార‌ణ‌మట‌. ప్ర‌స్తుతం క‌రోనా విష‌యంలోనూ మహిళల కంటే పురుషులు అధికంగా మరణిస్తున్న సంఘ‌ట‌న‌లు చూస్తున్నాం. దీనికి గ‌ల కార‌ణం జన్యుపరమైన కారణాలు అని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. మహిళల్లో ఉండే ఎక్స్‌, ఎక్స్‌ క్రోమోజోమ్‌లు క‌రోనా వైర‌స్‌ను క‌ట్ట‌డి చేస్తున్నాయ‌ని కెనడాకు చెందిన ఫిజీషియన్ డాక్టర్‌ షరోన్‌ మోలెమ్ వెల్ల‌డించారు.

అయితే పురుషుల్లో మాత్రం ఎక్స్‌ - వై క్రోమోజోమ్‌ లు క‌రోనాను త‌ట్టుకోలేక‌పోతాయంట‌. మహిళల్లో ఉండే ఎక్స్‌, - ఎక్స్‌ క్రోమోజోమ్‌ లు ఉంటాయి. మెదడుకు సంబంధించిన ముఖ్యమైన జన్యువులు ఎక్స్‌ క్రోమోజోమ్‌ లోనే ఉంటాయి. మనిషి జీవించడానికి ఎక్స్‌ క్రోమోజోమే అత్యంత కీలకం. దీంతోనే దీర్ఘకాలం జీవించడానికి ఎక్స్‌ క్రోమోజోమ్‌ లే ఎక్కువగా దోహదం చేస్తాయంట‌. ఈ క్ర‌మంలో మహిళలకు ఎక్స్ క్రోమోజోమ్‌ లు అధికంగా ఉండ‌డంతో వారు జీవించే కాలం అధికంగా ఉంటుంది. ఇది మ‌హిళ‌ల‌కు పుట్టుకతో సహజంగా వచ్చే ప్రయోజనం. దీనికి తోడు ఈస్ట్రోజన్‌ వల్ల కూడా మహిళల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. పురుషుల్లో కేవ‌లం కండబలం, -శారీరక బలం ఉంటుంది కానీ జీవించే కాలం త‌క్కువ‌గా ఉంటుంది.

స్త్రీల్లో ఈస్ట్రోజ‌న్‌ తో రోగ నిరోధ‌క శ‌క్తి పెంచుతుండ‌గా పురుషుల్లో టెస్టోస్టిరాన్ వ‌ల‌న రోగ నిరోధక శ‌క్తిని తగ్గిస్తుందని ఆమె చేసిన ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. ఈ క్ర‌మంలోనే జన్యుపరంగానే పురుషుల్లో ఇన్ ఫెక్షన్లు - అంటువ్యాధులు అధికంగా వ‌స్తాయి. పురుషుల‌కు వాటితో పోరాడే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ విష‌యంలోనూ స్త్రీల క‌న్నా పురుషులు ఎక్కువ న‌ష్ట‌పోతున్నారు. ఈ అంశాల‌పై ఆమె 'ది బెటర్‌ హాఫ్‌: ఆన్‌ ద జెనెటిక్‌ సుపీరియారిటీ ఆఫ్‌ విమెన్‌' అనే పుస్తకాన్ని రాశారు. తాను చేసిన ప‌రిశోధ‌న‌ల్లో తెలుసుకున్న అంశాల‌న్నీ పొందుప‌ర్చారు. ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ కూడా ఆమె ప్ర‌స్తావించిన‌ట్టు చెప్పారు.
Tags:    

Similar News