కరోనా వైరస్ ను నియంత్రించేందుకు చైనా - జపాన్ దేశాల్లో వాడిన ‘ఫవిపిరవిర్’ అనే యాంటీ వైరల్ డ్రగ్ బాగా పనిచేసింది. దీంతో ఈ డ్రగ్ ను అభివృద్ధి చేయడానికి భారతదేశం ఫోకస్ చేసింది. తాజాగా హైదరాబాద్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)కి ఈ యాంటీ వైరల్ డ్రగ్ తయారు చేసే టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ‘పవిపిరవిర్ - ఫైటో ఫార్మస్యూటికల్’ అనే యాంటీ వైరల్ డ్రగ్ పై క్లినికల్ ట్రయల్స్ కోసం దరఖాస్తు చేసింది. దీనికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమంతి మంజూరు చేసింది.
ప్రస్తుతం ఈ డ్రగ్ పై సీఎస్ ఐఆర్ భారత ప్రభుత్వ ల్యాబ్ లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఈ డ్రగ్ టెక్నాలజీని ఓ ప్రైవేట్ కంపెనీకి అప్పగించారు. ‘కెడిలా ఫార్మాసూటికల్స్ లిమిటెడ్’ అనే ప్రైవేట్ కంపెనీ తాజాగా కరోనా రోగులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఇందుకోసం దేశంలోని 3 ప్రధాన ఆసుపత్రుల్లో పరీక్షలకు డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా తాజాగా ప్రైవేట్ కంపెనీకి అనుమతిచ్చింది.
రోగుల అంగీకారంతోనే కరోనా పేషంట్లపై దీన్ని పరీక్షిస్తారు. మనిషి శరీరంలోకి వైరస్ సాధారణంగా ప్రవేశించగానే అనేక రూపాలుగా రూపాంతరం చెందుతుంది. ఫవిపిరవిర్ డ్రగ్ దాన్ని అడ్డుకుంటుందని తేల్చారు. చైనా - జపాన్ లో ఈ డ్రగ్ నే చికిత్సకు వాడుతున్నారని సైంటిస్టులు తెలిపారు. ఈ డ్రగ్ పరీక్షల్లో పాస్ అయితే ఈ కరోనా చికిత్సకు ఒక మందు దొరికినట్టే..