కరోనా వైరస్ విజృంభణ ప్రపంచం వ్యాప్తంగా విస్తరిస్తూపోతుంది. ఆ దేశం ఈ దేశం అన్న తేడా లేకుండా కరోనా మహమ్మారి వ్యాప్తి ఎల్లలు దాటుతోంది. ప్రపంచంలోని ఏ దేశాన్ని కూడా ఈ మహమ్మారి వదిలిపెట్టడం లేదు. ఇక మొదటి వేవ్ ముగిసింది ఇక కరోనా పీడ పోయినట్టే అని అనుకునే సమయంలోనే సెకండ్ వేవ్ విజృంభణ మొదలైంది. అయితే , ఈ సెకండ్ వేవ్ కొనసాగుతున్న సమయంలోనే .. మూడో వేవ్ రాబోతోంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. ప్రతి రోజు కూడా లక్షల సంఖ్య లో కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. అలాగే వేల సంఖ్యలో కరోనా మరణాలు చోటు చేసుకుంటున్నాయి.
ఇదిలా ఉంటే ఏపీలో కూడా కరోనా మహమ్మారి జోరు కొనసాగుతోంది. రోజురోజుకి నమోదు అయ్యే కరోనా మహమ్మారి కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. ఇక రాష్ట్రంలోని విశాఖపట్నం లో కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు ప్రతి రోజూ రెండు వేలకు తక్కువ కాకుండా నమోదు అవుతున్నాయి. ఈ నేపధ్యంలో డాక్టర్లు, న్యాయవాదులు, అద్యాపకులు, వ్యాపారులు, సామాన్యులు ఇలా అన్ని వర్గాల ప్రజానీకం కరోనా భారిన పడి కన్నుమూస్తున్నారు . ప్రస్తుతం, విశాఖలోని కేంద్ర కారాగారంలో కూడా కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తుంది. విశాఖలో ఉన్న ఈ కారాగారంలో 120కి పైగా ఖైదీలు ఉంటే ఇందులో 60 మంది దాకా కరోనా బారిన పడ్డారనే ఒక వార్త సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. తాజాగా ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తే కరోనా బాధితులు పెద్ద సంఖ్యలో తేలారట. దీనితో ఇంత మందికి వైద్యం గురించి కారాగారం సిబ్బంది మల్లగుల్లాలు పడుతున్నట్లుగా తెలుస్తోంది. వారిని అక్కడే ఉంచితే మొత్తానికి మొత్తం కరోనా చుట్టుకుంటుందన్న ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది.