ఇండియా కి వచ్చేసిన కరోనా వైరస్ .. ముంబై లో ఇద్దరికి గుర్తింపు !

Update: 2020-01-24 11:01 GMT
ప్రస్తుతం ప్రపంచదేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. చైనా నుంచి అమెరికా వరకు వ్యాపించిన ఈ వైరస్‌ ని అరికట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా చాలావేగంగా ప్రపంచం అంతా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటికే చైనాలో ఈ వైరస్ భారిన పది 25 మంది మృత్యువాత పడ్డారు. అలాగే మరో 800 మందిని అతలాకుతలం చేస్తోంది. ఇక ఇప్పటికే ఈ కరోనా వైరస్ జపాన్, థాయిలాండ్, అమెరాకా వంటి దేశాలకి పూర్తిగా వ్యాపించింది అని సమాచారం. ఇక గురువారం సౌదీ అరేబియాలో పనిచేస్తోన్న ఓ కేరళ నర్సుకూ వ్యాపించింది..అలాగే శుక్రవారం నాటికి ఇండియాలోనూ ఆ వ్యాధి లక్షణాలున్న ఇద్దరిని గుర్తించడంతో ఇండియా లో కూడా ఈ కరోనా వైరస్ ఆందోళన ఇంకా పెరిగిపోయింది.

ఇండియా లో మరో రెండు రోజుల్లో గణతంత్ర వేడుకలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో దేశం మొత్తం అందుకు తగ్గ ఏర్పాట్లని సిద్ధం చేసుకుంటున్న తరుణంలో ఈ వైరస్ ఇండియా లోకి కూడా వ్యాప్తి చెందింది అన్న వార్త తెలియడం నిజంగా చేదువార్తే. ఈ మహమ్మారి నావల్ కరోనా వైరస్ ఇండియాలోకి ప్రవేశించింది. తొలి పంజా మన ఆర్థిక రాజధాని ముంబైపై విసిరింది. చైనా నుంచి ముంబై వచ్చిన ఇద్దరు వ్యక్తులకు వైరస్ సోకినట్లు గుర్తించామని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ శుక్రవారం సంచలన ప్రకటన చేసింది.

ఆ ఇద్దరరి ప్రస్తుతం.. దక్షిణ ముంబై, చించ్పోకలిలోని కస్తూర్బా ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు బీఎంసీ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పద్మజా కేస్కర్ చెప్పారు. గడిచిన రెండు వారాలుగా ఆసియా దేశాలను వణికిస్తున్న కరోలినా వైరస్ తొలిసారి ఇండియా లోకి ప్రవేశించడం, అది కూడా ఆర్థిక రాజధాని ముంబై కి సోకడం దేశం అంతటా ఆందోళన మొదలైంది. ముందు జాగ్రత్త చర్యగా బీఎంసీ పరిధిలోని ప్రధాన ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాల్సిందిగా సూచించినట్లు డాక్టర్ పద్మజా తెలిపారు. ఏదేమైనా కూడా ప్రజలు కొన్ని రోజుల పటు జాగ్రత్తలు పాటించడం చాలా మంచింది.
Tags:    

Similar News