కరోనా వైరస్ పేరింటినే ప్రస్తుతం ప్రపంచ దేశాల వెన్నులో వణుకుపుడుతోంది. చైనాలో సోకిన కరోనా(కోవిడ్) వైరస్ క్రమేణ తన ప్రభావాన్ని చూపుతుండటంతో అన్నిదేశాలు అలర్టయ్యాయి. చిన్న, పెద్ద దేశాలనే తేడా లేకుండా కోవిడ్ వైరస్ ప్రభావం చూపుతోంది. కోవిడ్ వైరస్ కోసం శాస్త్రవేత్తలు చేస్తున్న ఫలితాలు అనుకూలించకపోవడంతో ప్రపంచ దేశాలు భయాందోళనలకు గురవుతున్నాయి. చైనాలో వేల సంఖ్యలో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. కరోనాతో ఇప్పటికే వందల సంఖ్యలో మృత్యువాతపడ్డారు. మరోవైపు కోవిడ్ ఎఫెక్ట్ తో ప్రపంచ స్టాక్ మార్కెట్ల కుదేలవుతున్నాయి.
*పెరుగుతున్న కరోనా కేసులు..
చైనాలో సోకిన కరోనా వైరస్ ప్రస్తుతం 57దేశాలకు వ్యాపించింది. చైనా తర్వాత అత్యధికంగా కరోనా కేసులు దక్షిణ కొరియాలో నమోదయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే 594మందికి కరోనా కేసులు నమోదు కావడంతో దక్షిణ కోరియా కలవరపడుతోంది. దక్షిణ కొరియాలో ఇప్పటికే 16మంది కరోనాతో మృతిచెందాడు. చైనాలో ఇప్పటి వరకు 79,251మందికి కరోనా సోకినట్లు గురించారు. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో చైనా దేశంలో ఆందోళన నెలకొంది.
*నియంతను భయపెడుతున్న కోవిడ్..
దక్షిణ కొరియాలో కరోనా కేసులు నమోదవడం తో పక్కనే ఉన్న ఉత్తర కొరియా అలర్టయింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఇల్ మిలిటర్ డ్రిల్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కోవిడ్ దేశంలోకి వ్యాపించకుండా ఉత్తర కొరియా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వైరస్ కట్టడి చేయడం దేశ ప్రజలకు భద్రతకు సంబంధించిన విషయమని కిమ్ ఉద్భోద చేస్తున్నారు. వైరస్ కట్టడిలో అధికారులు విఫలమైతే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే చైనాతో సరిహద్దులను ఉత్తర కొరియా మూసివేసింది. చైనాకు అన్ని రవాణా మార్గాలను మూసివేసింది. లౌడ్ స్పీకర్లు పెట్టి ప్రజల్లో కరోనాపై అవగాహన కల్పిస్తుంది.
అదేవిధంగా కరోనా వైరస్ పట్ల ఉదాసీనంగా వ్యహరించారని ఆరోపణలు వచ్చిన అధికార వర్కర్స్ పార్టీ ఉపాధ్యక్షుడు రీ మాన్ గోన్, పాక్ తై డోక్ ను కిమ్ పదవీ నుంచి తప్పించారు. విదేశీయులను ప్రత్యేక కేంద్రాలకు తరలించి పర్యవేక్షిస్తున్నారు. ఉత్తర కొరియా కరోనా వైరస్ కట్టడికి చేస్తున్న ప్రయత్నాలను విదేశీ దౌత్యధికారులు ప్రశంసిన్నారు. ఉత్తర కొరియాపై భద్రతా మండలిలో విధించిన అంక్షలపై మానవత్వం కోణంలో మినహాయింపు ఇస్తున్నారు. కరోనా వైరస్ కట్టడికి అవసరమైన సామాగ్రిని ఆ దేశానికి సరఫరా చేసేందుకు ఐరాస సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. అయితే ఉత్తర కొరియా అన్ని మార్గాలను మూసివేయడంతో సామాగ్రి తరలింపు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు సమాచారం.
*ఉత్తర కొరియా ప్రకటనలపై అనేక అనుమానాలు..
చైనాతో సరిహద్దు కలిగిన ఉత్తర కొరియాలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ప్రకటించింది. పొరుగుదేశాలైన చైనా, దక్షిణ కొరియాతో సంబంధం ఉన్న ఉత్తర కొరియాలో ఒక్క కేసు నమోదు కాలేదని చెబుతుండటం పలు అనుమానాలకు తావినిస్తోంది. అయితే దేశంలో కరోనా వైరస్ సొకిన కొందరిని కాల్చిచంపారనే ఆరోపణలు వెలువడుతున్నాయి. కరోనా వైరస్ సోకినట్లు అనుమానం ఉన్నవారిని రాజధాని ప్యాంగ్ యాంగ్లో నిర్భంధించారనే వార్త కథనాలు అక్కడి మీడియాలో హల్ చేస్తున్నారు.
ఏదిఏమైనా కరోనా కట్టడికి ఉత్తర కొరియా మిగతా దేశాల కంటే ముందే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రకృతి వినాశానికి పాల్పడుతున్న మానవుడు ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే రానున్న రోజుల్లో మరిన్ని వైరస్ లు పుట్టుకు రావడం ఖాయంగా కన్పిస్తుంది. మానవుడు ప్రకృతిని ఏనాడైతే ప్రేమిస్తే అనాడే మానవుడికి రక్షణ దొరకుతుంది.. లేనట్లయితే ఇలాంటి వైరస్ బారినపడి అంతం కావాల్సిందే.