చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి మరోసారి ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకు అక్కడే పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. చైనాలోని అతి పెద్ద నగరాలైన షాంఘై, బీజింగ్ లలో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య అధికంగా ఉంటుందో. ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ రెండు నగరాలే కీలకం. కానీ ప్రస్తుతం ఆ నగరాల్లో రోజుకు 15 వేల కొత్త కేసులు నమోదు అవుతున్నాయి.
ఈ విషయం గుర్తించిన చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. రెండు నగరాల్లో లాక్ డౌన్ విధించి కఠిన ఆంక్షలు అమలు చేస్తుంది. ముఖ్యంగా షాంఘైలో పెరుగుతున్న కొవిడ్ కేసులతో..అక్కడి ప్రజల ఇబ్బందులు విపరీతంగా పెరిగిపోయాయి. ఓ వైపు కరోనా, మరోవైపు ఆకలితో బాధపడుతున్నారు. అయితే కరోనా సోకిన వారి ఇండ్ల చుట్టూ ప్రభుత్వం ఫెన్సింగ్ ఏర్పాటు కూడా చేయిస్తోంది. వీటన్నిటిని తట్టుకోలేక అక్కడి ప్రజలు.. ఆ ప్రాంతాన్ని వదిలి వెల్లిపోవాలని నిర్ణయించుకున్నారు.
ప్రభుత్వం లాక్ డౌన్ విధించి.. కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికీ... ఏదో ఒకలా షాంఘై ను విడిచి పెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా పట్టణాన్ని విడిచి వెళ్లడానికి ప్రజలు ఒకరికొకరు ఉపాయాలు కూడా చెప్పుకుంటున్నారంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చైనా దేశంలో షాంఘై అత్యంత కీలకమైన పట్టణం. ఎన్నో ఐటీ కంపెనీలతో పాటు వేలల్లో విదేశీయులు కూడా ఉన్నారు.
అయితే అక్కడున్న వారంతా చాలా వరకు వేరే ప్రాంతాలకు వెళ్లిపోవాలని చూస్తున్నారు. ప్రతి నెలా ప్యాకర్స్ అండ్ మూవర్స్ కు 30 నుంచి 40 ఆర్డర్లు ఉండేవి. కానీ ప్రస్తుతం విపరీతమైన ఆర్డర్లు పెరిగిపోయాయని నిర్వాహకులు చెబుతున్నారు. కానీ వారు వేరే ప్రాంతాలకు వెళ్లేందుకు ఇరుగు పొరుగు వాళ్లు కూడా సాయం చేసేందుకు ముందుకు రావట్లేదట. కేసుల కారణంగా దాదాపు అంతా హోం ఐసోలేషన్ లోనే ఉండిపోతున్నారు.
కరోనా ఇంతగా విజృంభిస్తున్నప్పటికీ.. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని విదేశీయులు చైనా ప్రభుత్వం పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇఖ షాంఘై ను విడిచి పెట్టడమే అత్యుత్తమ నిర్ణయమనే పరిష్కారానికి వచ్చారు. ఇక అక్కడ క్యాబ్ రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. నిజానికి విమానాశ్రయం వెళ్లడానికి 30 డాలర్లు ఖర్చు అయితే... ప్రస్తుతం క్యాబ్ డ్రైవర్లు 500 డాలర్ల వరకు తీసుకుంటున్నారని ప్రజలు చెబుతున్నారు. మరి చైనా ప్రభుత్వం ఇప్పటికైనా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.