నిఖిల్ లాక్ డౌన్ పెళ్లి కథ ముగిసిందనుకుంటే... మళ్లీ తెరమీదకు వచ్చింది. ఈ పెళ్లి లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా ఎలా చేశారు? చర్యలు ఎందుకు తీసుకోలేదు అంటూ కర్ణాటక హైకోర్టులో పిటిషను పడింది. దీనిని విచారించి కర్ణాటక హైకోర్టు ... యెడ్డీపై ప్రశ్నల వర్షం కురిపించింది. అన్నీ తెలిసి ఎందుకు పెళ్లికి అనుమతిచ్చారు? మాస్కులు ధరించకుండా పెళ్లికి హాజరైన వారిపై చర్యలేం తీసుకున్నారు? సామాజిక దూరం కూడా పాటించలేదు. ఇది సామాజిక విద్రోహ చర్యగా పరిణమిస్తే దానిని ఎలా అరికడతారు? వంటి అనేక ప్రశ్నలతో సీఎం యెడ్డ్యూరప్పను ప్రశ్నించింది.
ఆ పెళ్లికి ఊరికే అనుమతి ఇచ్చి వదిలేసినా ఇంత పెద్ద సమస్య ఉండేదికాదు. కానీ స్వయంగా తనే హాజరు అయ్యేటప్పటికి ఈ తలనొప్పిని ఎలా వదిలించుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు యెడ్యూరప్ప. 17న జరిగిన ఈ పెళ్లి ఒక రోజు తర్వాత బయటకు వచ్చింది. కనీసం ఫొటోలు బయటకు రాకున్నా బాగుండేది. కానీ కుమారస్వామి కుటుంబమే నెట్లో ఫొటోలు పెట్టి వివాదం మరింత ముదిరేలా చేసింది. దీనిపై చర్యలు తీసుకోమని, విచారణ చేయమని మొదట్లో కర్ణాటక సర్కారు హడావుడి చేసినా... అక్కడితో వదిలేశారు. ఇపుడు కోర్టు వల్ల మళ్లీ తెరమీదకు వచ్చింది.