ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విశ్వరూపం చూపిస్తోంది. దశలవారీగా పంజా విసురుతోంది. గ్యాప్ ఇస్తూ కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి. ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ పాజిటివ్ కేసుల సంఖ్య ఘనంగా పెరుగుతున్నాయి. ఇక భారతదేశంలోనూ మూడో వేవ్ ప్రారంభమైందని హెచ్చరికలు జారీ అవుతున్నాయి. అయితే ముందు నుంచి చెబుతున్నట్లుగా ఆ దశలో పిల్లల్లో ఎక్కువమంది వైరస్ బారిన పడుతున్నారు. మొదటి దశ, సెకండ్ వేవ్ తో పోల్చితే ఈ సారి ఎక్కువమంది చిన్నారుల్లో వైరస్ ను నిర్ధారణ అవుతోంది. పిల్లల్లో కరోనా కేసులకు సంబంధించిన డేటాను అమెరికా విడుదల చేసింది.
అమెరికాలోని 14 రాష్ట్రాల్లోని 250 ఆస్పత్రుల నుంచి సేకరించిన సమాచారంతో వ్యాక్సిన్ కు అర్హత లేని వారికి సంబంధించిన డేటాను రూపొందించగా... ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. పిల్లల్లో వైరస్ కేసులు పెరుగుతున్నాయని ఆ డేటాలో పేర్కొన్నారు. గతకొద్దిరోజులుగా ఆస్పత్రుల్లో చేరుతున్న చిన్నారుల సంఖ్య పెరుగుతోందని అందులో పొందుపర్చారు. వారిలో వైరస్ కు సంబంధించిన తీవ్రమైన లక్షణాలు పెద్దగా లేనట్లుగా అందులో వివరించారు చిన్నారుల్లో ప్రతి లక్ష మందిలో ఇద్దరు నుంచి నలుగురిలో వైరస్ బయటపడుతోంది. ఇక అయిదు నుంచి పదిహేడేళ్ల లోపు పిల్లల్లో ప్రతిలక్ష మందిలో ఒకరు వైరస్ బారిన పడుతున్నారు. పిల్లల్లో నమోదవుతున్న కేసుల పట్ల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చిన్నారులకు కూడా టీకా అందుబాటులోకి వస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. అయితే కరోనా నుంచి చిన్నారులకు విముక్తి కలిగించడానికి వీలైనంత త్వరగా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకురావాలని అమెరికా యోచిస్తోంది.
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. దాదాపు అన్ని దేశాల్లోనూ పిల్లలతో పాటు పెద్దల్లోనూ వైరస్ కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. టీకా తీసుకున్న వారు కూడా మహమ్మారి బారిన పడుతున్నారు. అయితే వ్యాక్సినేషన్ పై దేశాలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఇక యూకే అయితే ఏకంగా నాలుగో డోసును అందిస్తోంది. మూడు డోసులు తీసుకున్న వృద్ధులు ఆస్పత్రుల్లో చేరడం దాదాపు 95 శాతం తగ్గింది. ఫలితంగా నాలుగో డోసు ఇవ్వాలని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపోతే భారత్ లోనూ బూస్టర్ డోసుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అవసరం మేరకు అందిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
ప్రపంచవ్యాప్తంగా ఒక్కవారంలోనే ఏకంగా 13మిలియన్లకు పైగా మంది వైరస్ బారిన పడ్డారు. ఇప్పటివరకు 300 మందికి మహమ్మారి సోకింది. ఇకపోతే భారతదేశంలోనూ రోజుకు లక్ష కేసులు నమోదవుతున్నాయి. దక్షిణాఫ్రికాలో పుట్టిన కొత్తవేరియంట్ కేసులు సైతం పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాలు ఆంక్షల వలయంలోకి వెళ్లాయి. పలువురు ప్రజాప్రతినిధులు, సినీ తారలు ఇప్పటికే వైరస్ బారిన పడ్డారు.