గతంలో రోజూ లక్షల సంఖ్యలో కరోనా కేసులతో బెంబేలెత్తించిన మహారాష్ట్రలో మళ్లీ కోవిడ్ నిబంధనలు షురూ అయ్యాయి. ప్రస్తుతం దేశంలో రోజూ 4,000 వేలకు పైగా కరోనా కేసులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నాలుగు వేవ్ వచ్చే అవకాశాలను కొట్టేయలేమని వైద్య నిపుణులు చెబుతున్నారు. మహారాష్ట్రలోనూ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా కోవిడ్ నిబంధనలను అమలు చేస్తోంది.
ఇందులో భాగంగా మళ్లీ మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేశారు. పబ్లిక్ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్కు ధరించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రైళ్లు, బస్సులు, సినిమా హాళ్లు, ఆడిటోరియంలు, ఆఫీసులు, ఆస్పత్రులు, కళాశాలలు, పాఠశాలల్లో తప్పనిసరిగా అంతా మాస్కులు ధరించాలని సూచించింది.
ఈ మేరకు మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఎక్కువ కోవిడ్ టెస్టులు చేయడానికి, వీలైనంత వేగంగా చేయడానికి వీలుగా ల్యాబుల్లో సౌకర్యాలు మెరుగుపర్చాలని సూచించింది. కరోనా పరీక్ష వచ్చిన ప్రతి శాంపుల్ ను పరీక్షించాలని ఆదేశించింది. మాస్కులు ధరించడంతోపాటు మహారాష్ట్ర ప్రభుత్వం మరిన్ని మార్గదర్శకాలు జారీ చేసింది.
జ్వర బాధితులను గుర్తించడంతోపాటు తప్పనిసరిగా వారికి పరీక్షలు జరపాలని ఆదేశించింది. అలాగే కోవిడ్ లక్షణాలు ఉన్నవారికి తప్పనిసరిగా పరీక్షలు జరిపించాలని సూచించింది. ముఖ్యంగా వృద్ధులకు మాస్కు వాడకం, శానిటైజేషన్ లపై అవగాహన కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ లక్షణాలను లైట్ తీసుకుని వదిలేస్తే ఎదురయ్యే ప్రమాదాల గురించి, ఎదురయ్యే దుష్పరిణామాల గురించి ప్రజలకు వివరించాలని మహారాష్ట్ర ప్రభుత్వం అధికారులకు జారీ చేసింది. కాగా మహారాష్ట్రలో శుక్రవారం ఒక్కరోజే 1134 కేసులు నమోదయ్యాయి.
కాగా కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. భారత్ లో శనివారం కొత్తగా 3,962 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య.. 4,31,72,547కు చేరుకుంది. కరోనా వల్ల గత 24 గంటల్లో 26 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు మృతుల సంఖ్య 5,24,677కి చేరింది.