ఏపీలో ఇద్దరే ఇద్దరు నాయకులు ఉన్నారు. అక్కడ రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. వాటిని ఆ ఇద్దరూ ఏక మాట మీద నడుపుతున్నారు. పార్టీలో వారిదే తిరుగులేని మాట. ఇక ప్రభుత్వంలోకి వచ్చినా వారే బలమైన ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఈ ఇద్దరి విషయంలో చాలా మందికి చాలా రకాలైన అభిప్రాయాలు ఉంటాయి.
మరి యాభైఏళ్ల పాటు రాజకీయాల్లో పండిపోయిన సీపీఐ సీనియర్ నేత, కామ్రెడ్ నారాయణకు వీరి విషయంలో ఎలాంటి భావాలు ఉన్నాయో అన్నది అందరికీ ఆసక్తికరమే. నారాయణ ప్రస్తుతం సీపీఐ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. ఆయన జగన్ గురించి చంద్రబాబు గురించి ఒక టీవీ చానలో ప్రసారం అవుతున్న ఓపెన్ హార్ట్ విథ్ ఆర్కేలో కుండబద్ధలు కొట్టారు.
జగన్ విషయమే తీసుకుంటే ఇంకా ఆయన కుర్రోడని నారాయణ అనడం విశేషం. జగన్ రాజకీయాల్లో ఇంకా చాలా చూడాలి. అనుభవైంచాల్సింది ఎంతో ఉంది అని కూడా ఈ సీనియర్ అంటున్నారు. అయితే జగన్ తనలో తాను మారాలని, పాలనలో రాక్షసత్వ పోకడలు విడనాడి మానవత్వ దృక్పధంతో వ్యవహరించాలి తప్ప ఈ ముఖ్యమంత్రి ఎందుకు బాబూ అని జనాలు అనుకునేలా సీన్ తెచ్చుకోకూడదని నారాయణ హితవు పలికారు.
ఇక చంద్రబాబు విషయంలో ఆయనకు బీజేపీ అంటే భయమేదో ఉందని సందేహాన్ని బయటపెట్టారు, తనను జైలులో పెడతారేమో అని బాబు భయపడుతున్నారని నారాయణ అంటున్నారు. చంద్రబాబు కనుక ఆ భయాన్ని వీడితే జాతీయ స్థాయిలో ఆయన గొప్ప నాయకుడుగా ఉంటారని నారాయణ జోస్యం చెప్పేశారు. మొత్తానికి ఈ ఇద్దరు నాయకులు ఎక్కడ తగ్గాలో నేర్చుకుంటే ఎక్కడ నెగ్గడమో వారికి తెలుస్తుంది అన్నది సీనియర్ కామ్రెడ్ భావనగా అర్ధం చేసుకోవాలి.
ఇక ఈ ఆదివారం ప్రసారం అయ్యే ఈ ఎపిసోడ్ లో నారాయణ కేసీయార్ మీద కూడా చేసిన సంచలన కామెంట్స్ ని చూడవచ్చు. అలాగే ఆయన భారత దేశంలో కమ్యూనిజం ఉనికి ఎంత దానికి ఫ్యూచర్ ఉందా అన్న దాని మీద ఏం చెప్పారో కూడా అంతా చూసి తీరాల్సిందే అంటున్నారు.