మహానాడులో పుష్టిగా తిన్నారు.. తిట్టారు..

Update: 2018-06-01 06:33 GMT

భోజనాల కోసమే మహానాడును నిర్వహించారని.. పుష్టిగా తిని  విమర్శలు చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. విజయవాడలో ఈరోజు విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన చంద్రబాబు తీరును ఎండగట్టారు. చంద్రబాబు తనను ప్రధానమంత్రి అని పొగిడించుకున్నారని.. అది పొగడ్తల మహానాడు అని విమర్శించారు. చంద్రబాబు స్వర్ణాంధ్రప్రదేశ్ డబ్బున్న వాళ్ల కోసమే కానీ.. పేదల కోసం కాదని.. బాబు పాలనలో పేదల సమస్యలు పరిష్కారం కాలేదని ఆయన అన్నారు.

చంద్రబాబు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 18న తహసీల్దార్థ కార్యాలయాల దగ్గర నిరసన ప్రదర్శనలు చేపట్టబోతున్నట్లు  రామకృష్ణ  తెలిపారు. చంద్రబాబు 20 లక్షల మందికి ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారని.. కానీ ఎక్కడా ఒక్క ఇల్లు కట్టలేదని విమర్శించారు. 13 జిల్లాల్లో ఒక్క ఎకరా భూమి కూడా పంపిణీ సీఎం చంద్రబాబు పంపిణీ చేయలేదన్నారు.

అందుకే ప్రభుత్వం కళ్లు తెరిపించడానికి 18న నిరసన చేపట్టబోతున్నట్టు తెలిపారు. వెయ్యి రూపాయల భృతి నిరుద్యోగులకు ఏం సరిపోతుందని.. నెలకు రూ.3600 ఇవ్వాలని ప్రబుత్వాన్ని డిమాండ్ చేశారు. పదోతరగతి పాస్ అయిన వారికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి విషయంలో 10 లక్షల మందే అంటూ కటాఫ్ పెట్టడం సమంజసం కాదన్నారు.
Tags:    

Similar News