నోట్ల రద్దు నిర్ణయంతో నోట్ల కష్టాలు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. రద్దు నిర్ణయం తీసుకొని నేటికి నెల రోజులు అవుతున్నా.. బ్యాంకుల వద్దా.. ఏటీఎం సెంటర్ల దగ్గరా నగదు తీసుకోవటానికి గంటల కొద్దీ టైంను వృధా చేసుకోవాల్సి వస్తోంది. ఇన్నేసి గంటలు క్యూలో నిలచున్నా.. చేతికి వచ్చేది చాలా తక్కువ మొత్తం కావటంతో.. ప్రతి వారం ఏదో ఒక రోజు బ్యాంకుకు వెళ్లి నగదు డ్రా చేసుకోవటమో.. ఏటీఎం సెంటర్ కు వెళ్లి డబ్బులు తీసుకోవాల్సిన దుస్థితి.
రూల్స్ ప్రకారం చూస్తే.. నగదు విత్ డ్రా చేయటానికి వారానికి రూ.24వేల వరకూ అనుమతి ఉన్నప్పటికీ.. బ్యాంకుల్లో నెలకొన్న నోట్ల కొరత పుణ్యమా అని అనధికారికంగా రూ.3వేల నుంచి రూ.4వేలకు మించి డబ్బులు ఇవ్వని పరిస్థితి. దీంతో.. నోట్ల కటకట సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది. మొదట్లో ఇలాంటి కష్టాలు మహా అయితే వారం.. లేదంటే పది రోజుల్లో అంతా సెట్ అవుతుందని అనుకున్నారు.
క్యాలెండర్లో రోజులు మారుతున్నా.. నోట్ల కష్టాలు మాత్రం ఎంతకూ తీరటం లేదు. దీంతో.. ఏం చేయాలో పాలుపోవటం లేదని పలువురు వాపోతున్నారు. పెద్ద పెద్ద మొత్తాలు.. అద్దెలు.. లాంటి వాటిని ఆన్ లైన్ ద్వారా పే చేస్తున్నప్పటికీ.. చిల్లర ఖర్చులకు నోట్లు తప్పనిసరి అయ్యాయి.దీంతో.. ఈ నోట్ల కష్టాలు ఎప్పటికి తీరేను? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. అయితే.. ఈ కష్టాలు త్వరలో తీరనున్నట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ చెబుతోంది. డిమాండ్ కు తగినన్ని నోట్లు ఉన్నాయని.. త్వరలోనే విత్ డ్రా పరిమితిని కూడా పెంచనున్నట్లుగా చెబుతున్నారు.
రానున్న రెండు వారాల వ్యవధిలో కొత్త రూ.500నోట్లు.. రూ.100 నోట్లు అందుబాటులోకి రానున్నట్లు చెబుతున్నారు. ఇది కానీ అందుబాటులోకి వచ్చేస్తే నోట్ల కష్టాలు పూర్తిగా తీరిపోయినట్లేనని.. బ్యాంకుల వద్దసాధారణ పరిస్థితులు ఏర్పడిన తర్వాత.. ముందస్తుగా పెట్టిన ఆంక్షల్ని కూడా ఎత్తివేయనున్నట్లుగా ఆర్ బీఐ చెబుతోంది. సో.. మరో రెండు వారాలు ఓపిక పడితే.. నోట్ల కష్టాలు తగ్గటం మాత్రం ఖాయమన్న మాట వినిపిస్తోంది. నెల రోజుల నుంచి పడుతున్న కష్టాలు మరో రెండు వారాలు పడటానికి సాధారణ ప్రజలు సిద్ధమే. కానీ.. అంతకు మించి అయితేనే..అసలు సమస్య అవుతుంది.