అమెరికా కేంద్రంగా వాట్సాప్ తో కొత్త మోసానికి తెరతీసిన సైబర్ నేరస్థులు !
సైబర్ క్రైమ్స్ ఈ మధ్య రోజుల్లో బాగా ఎక్కువ అయ్యాయి. సైబర్ క్రైమ్స్ పై పోలీసులు ఎంత నిఘా పెట్టినా కూడా, పోలీసులకి ఎప్పటికప్పుడు సవాల్ విసురుతూ సరికొత్త దారులు వెతుకుతూ మోసాలకు పాల్పడుతున్నారు. నిన్న మొన్నటి వరకు ఫేక్ ఫేస్ బుక్ ఐడీలతో మోసాలకు పాల్పడిన సైబర్ మోసగాళ్లు, ప్రస్తుతం మోసం చేయడానికి వాట్సాప్ ను వాడుతున్నారు. అయితే, ఈ కొత్త మోసం అమెరికా కేంద్రంగా జరుగుతుంది. అమెరికాలో ఉండే వారి ఫొటోస్ ను వాట్సాప్ డీపీగా పెట్టి , వారి ఫోన్లలో ఉన్న కాంటాక్ట్ నెంబర్లను సేకరించి , భారత్ లో ఉంటున్న వారి సన్నిహితులకు మెసేజ్ చేస్తున్నారు.
ఇండియాలో ఉన్న తమ సన్నిహితులు అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో ఉన్నారని, తాను అమెరికా నుంచి డబ్బులు పంపించాలంటే సమయం పడుతుందని, కాబట్టి తాను తెలిపిన అకౌంట్ నెంబర్ కు వెంటనే డబ్బులు పంపించాలని మెసేజ్ పంపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పలువురి వాట్సాప్ నెంబర్లకు ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయి. ఇదో రకమైన కొత్త మోసం అని తెలియని అమాయకులు డబ్బులు పంపి మోసపోతున్నారు. తాజాగా హైదరాబాద్ బోయిన్‌పల్లికి చెందిన దిలీప్ కుమార్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు న్యూయార్క్‌లో ఉంటున్న తన స్నేహితుడు రమేశ్ ప్రొఫైల్ ఫొటోతో ఉన్న వాట్సాప్ నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. తన బాబాయ్ కరోనాతో ఆసుపత్రిలో చేరాడని. అత్యవసరంగా రూ. 2 లక్షలు అవసరం ఉన్నాయని, డబ్బులు పంపిస్తే రెండు రోజుల్లో తిరిగి పంపిస్తామని మెసేజ్ వచ్చింది.
దీనితో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా దిలీప్ వెంటనే రూ.2 లక్షలను పంపించాడు.ఆ తర్వాత రమేశ్ కు కాల్ చేసి ఈ విషయమై అడగ్గా తాను ఎలాంటి మెసేజ్ చేయలేదని సమాధానం చెప్పడంతో తాను మోసపోయానని. వెంటనే పోలీసులకు ఈ విషయమై ఫిర్యాదు చేశాడు. ఈ తరహా మెసేజ్ ల పై అందరూ జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఎవరైనా డబ్బుల కోసం మెసేజ్‌లు చేస్తే వారికి నేరుగా ఫోన్ చేసి కనుక్కున్న తర్వాతే లావాదేవీలు జరపాలని సూచిస్తున్నారు. ఇక వాట్సాప్ లో తమ ఫొటోలు అందరికీ కనిపించకుండా ఉండేందుకు సెట్టింగ్స్ లో మార్పులు చేసుకోవాలని చెబుతున్నారు. ఇక ఫోన్‌లో మాట్లాడితే గుర్తు పడతారనే కారణంగా మోసగాళ్లు కేవలం చాటింగ్ మాత్రమే చేస్తున్నారు. ఇదిలా ఉంటే డబ్బులు పంపించాలని సైబర్ నేరస్థులు పంపిస్తోన్న అకౌంట్ నెంబర్లన్నీ బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోవి ఉంటున్నాయి.