కోవిడ్ -19 మహమ్మారికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలతో కలిసిపోరాడుతున్నాం. 150 కి పైగా దేశాలకు భారత్ సహాయం అందించినట్లు ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం తెలిపారు. ఐక్యరాజ్యసమితి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ సెషన్ 2020 సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు.
"కోవిడ్ -19 మహమ్మారి అన్ని దేశాల శక్తి సామర్థ్యాలను తీవ్రంగా పరీక్షించింది. భారతదేశంలో ఈ మహమ్మారిని ప్రభుత్వం - పౌర సమాజం సంయుక్తంగా పోరాటం చేశాయి. కరోనాపై పోరాటాన్ని ప్రజల ఉద్యమంగా మార్చడానికి మేము ప్రయత్నించాం” అని ప్రధాని వ్యాఖ్యానించారు.
భారతదేశం సనాతంగా వైద్యచికిత్సలకు పునాదులు వేసిన దేశం. ఆ మూాలాలే కోవిడ్ -19 మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటంలో భారతదేశాన్ని ముందంజలో నిలిపాయి. అందువల్లే వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి ప్రపంచంలోనే అత్యుత్తమ రికవరీ రేటును భారతదేశం సాధించిందని ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు.
సుస్థిర శాంతి, శ్రేయస్సు సాధించే మార్గంలో నడుస్తూ సర్వ మానవాళికి మిత్రుడిగా కొనసాగడాన్ని భారత్ గట్టిగా నమ్ముతోందని ప్రధాని అన్నారు.