వ్యాక్సిన్ తీసుకున్న నగరాల్లో కరోనా తగ్గుముఖం...!

Update: 2021-05-17 08:32 GMT
ప్రపంచంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఓ వైపు కొనసాగుతున్నా కూడా , మరోవైపు ఎక్కువగా వ్యాక్సినేషన్ ఇచ్చిన నగరాల్లో కరోనా కొంతమేర అదుపులోకి వచ్చింది అని చెప్పవచ్చు. అయితే , వ్యాక్సినేషన్ విషయంలో కొంచెం వెనకబడిన  ఉన్న భారత్ , దక్షిణ అమెరికా దేశాలలో వైరస్ వ్యాప్తి మళ్లీ పెరిగిపోతుంది. ఢిల్లీ, గోవా లలో టీకాల తగ్గింపు కరోనా సంక్రమణ రేటుపై తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. అదే సమయంలో, టెల్ అవీవ్, న్యూయార్క్, లండన్, లాస్ ఏంజిల్స్‌ తో సహా అనేక నగరాల్లో ఎక్కువ టీకాలు వేయడం వల్ల ఇన్‌ ఫెక్షన్లు చాలావరకు తగ్గిపోయాయి. ప్రపంచంలో అత్యధిక టీకాలు వేసిన నగరాల్లో ఇజ్రాయెల్ రాజధాని తెలావివ్ ఒకటి. ఇక లండన్ లో నివసిస్తున్న వారిలో సగం మందికి టీకాలు వేశారు. ఆ కారణంగా ప్రస్తుతం లండన్ లో కరోనా వైరస్ మహమ్మారి పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రపంచంలోని 22 నగరాల్లో టీకా ప్రచారం, సంక్రమణ వేగం గురించి న్యూయార్క్ టైమ్స్ చేసిన విశ్లేషణలో గత కొన్ని నెలలుగా కరోనా వ్యాప్తిలో మార్పులు కనబడినట్టు పేర్కొన్నారు.

తక్కువ టీకాలు ఉన్న చోట, సంక్రమణ రేటు ఎక్కువగా ఉంది. భారతదేశం అలాగే, బ్రెజిల్ తమ ప్రాంతాలలో కరోనా వ్యాప్తిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.  ఇక దేశంలో ప్రతి నగరం కూడా ఓ సూపర్‌ స్పెడర్‌ గా ఉందని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని జనాభా, ఆరోగ్య ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.వి.సుబ్రమణియన్ చెప్పారు. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారతదేశంలో టీకాలు వేయడం ఆలస్యంగా ప్రారంభమైంది. టీకా వేగం గత కొన్ని వారాలలో బాగా తగ్గిపోయింది. దేశంలో సంక్రమణ ఇప్పుడు పొరుగు దేశాలకు వ్యాప్తి చెందుతోంది. లాటిన్ అమెరికా అంతటా బ్రెజిల్ నుండి కొత్త వేవ్ వచ్చింది. ఈ దేశాలలో వ్యాక్సినేషన్ పరిమితంగా జరిగింది. అయితే, వ్యాక్సిన్ ఒక్కటే కరోనా వ్యాప్తిని అరికట్టడంలో పని చేయలేదని నిపుణులు అంటున్నారు. ఆంక్షలు కూడా కరోనా సంక్రమణను తగ్గించాయి.  నియంత్రణ లేకపోయినప్పటికీ, దక్షిణ కొరియా, జపాన్లలో వరుసగా 7% మరియు 3% జనాభా టీకా యొక్క ఒక మోతాదు మాత్రమే పొందారు. అయినా ఇక్కడ సంక్రమణ రేటు తక్కువగా ఉంటుంది. ఆఫ్రికాలోని చాలా దేశాలలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా తక్కువ. టీకా ప్రపంచంలోని ప్రజలకు ఎలా అందుతోంది అనే విషయం ఇక్కడ అంచనా వేయవచ్చు. ప్రపంచంలోని 100 మందికి 18 మోతాదుల వ్యాక్సిన్ ఇప్పటివరకూ అందుబాటులో ఉంది. అదే సమయంలో, ఆఫ్రికాలో ప్రతి 100 మందికి 1.6 మందికి మాత్రమే టీకాలు వేశారు.
Tags:    

Similar News