ఎన్నికల ప్రచారం ముగియటానికి సమయం దగ్గర పడుతున్న వేళ..రాజకీయ నేతలు మాటల దాడిని మరింత పెంచారు. తమ రాజకీయ ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు మొదలు కొని ఆయన కుమారుడు లోకేశ్ తో సహా టీడీపీ నేతలంతా కేసీఆర్ బూచిని చూపించిన ఓట్లు దండుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా కనిపిస్తోంది.
తాజాగా మంత్రి లోకేశ్ చేస్తున్న వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా చెప్పాలి. తనను ఓడించటానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళగిరికి రూ.200 కోట్లు పంపినట్లుగా లోకేశ్ ఆరోపించారు. ఇప్పటికే ఏపీకి రూ.2వేల కోట్లు పంపారంటూ కేసీఆర్ పైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపణలు చేయటం తెలిసిందే.
ఓపక్క పెద్ద బాబు కేసీఆర్ మీద రూ.2వేల కోట్ల ఆరోపణలు చేస్తుంటే.. మరోవైపు చినబాబు తెలంగాణ ముఖ్యమంత్రి మీద రూ.200 కోట్ల ఆరోపణలు చేయటం గమనార్హం. ఆరోపణలు రాజకీయాల్లో మామూలే. అధికారంలో ఉన్న లోకేశ్ లాంటోళ్లు ఒక ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేసేటప్పుడు.. కనీసం చిన్న ఆధారాన్ని అయినా చూపించాల్సిన అవసరం ఉంది కదా. కేసీఆర్ పంపినట్లుగా చెప్పే వందల కోట్లకుసంబంధించి ఏమైనా ఆధారం ఉందా లోకేశా?