కరోనా జనాలను తీవ్రంగా వణికిస్తోంది. ఆ పేరు వింటేనే హడలెత్తిపోతున్నారు. ఈ పరిస్థితి ఎంతగా దిగజారిందంటే.. ఏ కారణంతో చనిపోయినా.. కొవిడ్ వల్లే చనిపోయారు అనేంతగా! తాజాగా ఓ వ్యక్తి ఇతర అనారోగ్యంతో చనిపోతే.. కనీసం దహన సంస్కారాలు చేసేందుకు సైతం బంధువులు ముందుకు రాని పరిస్థితి! ఈ దారుణ సంఘటన ఏపీలోని ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.
జిల్లాలోని కొమరోలుకు చెందిన ప్రైవేటు ఉపాధ్యాయుడు గాదంశెట్టి గుప్తా(40) కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. బ్లడ్ టెస్ట్ చేయించగా.. టైఫాడ్ అని నిర్ధారణ అయ్యింది. మందులు వాడుతూ ఇంటివద్దనే ఉంటున్నాడు. కానీ.. పరిస్థితి విషమించడంతో సోమవారం ప్రాణాలు కోల్పోయాడు.
అయితే.. గుప్తా కరోనాతోనే చనిపోయాడని భావించిన బంధువులు, చుట్టుపక్కల జనం కనీసం చూడ్డానికి కూడా రాలేదు. అంతేకాదు.. ఇరుగుపొరుగు తమ ఇళ్లకు తాళాలు వేసుకొని వెళ్లిపోయారట. దీంతో.. ఆయనకు దహన సంస్కారాలు చేయడానికి నలుగురు మనుషుల్లేకుండా పోయారు.
వాళ్ల ఇంట్లో వృద్ధ తల్లిదండ్రులతోపాటు భార్య మాత్రమే ఉంది. ఏం చేయాలో పాలుపోక వాళ్లు రోదిస్తుండగా.. చివరకు ఆయన స్నేహితులు ముందుకు వచ్చి, పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు నిర్వహించారు. ఇంతటి దారుణ పరిస్థితులు తెచ్చిన కరోనా.. ఇంకెన్ని ఘోరాలకు కారణమవుతుందో ఎవ్వరికీ అర్థం కాకుండా ఉంది.