ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీ - ప్రతిపక్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీల కంటే ఒక్క ఎమ్మెల్యే కూడా లేని కాంగ్రెస్ పార్టీయే బెస్ట్ అంట. ఈ మాట చెప్తున్నది ఎవరో గిట్టని వారు అనుకునేరు. లేకపోతే కాంగ్రెస్ పార్టీ వారు అని అనుకోకండి. సాక్షాత్తు ఆ రెండు పార్టీల నేతలే చెప్తున్నారు. ఇంతకీ సొంత పార్టీపై అంత కోపం ఎందుకు అంటారా? ఇరు పార్టీల పెద్దల నిర్ణయమే కారణం మరి.
ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీకి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ కార్యాలయం లేదు. కొద్దికాలం క్రితం అమరావతి ప్రాంతంలో స్థలం కోసం అన్వేషించారు. అయితే అక్కడ ఎక్కువ సమయం పడ్తుందని విజయవాడలోనే పార్టీ నేతలు స్థల వెతుకులాటలో పడ్డారు. అయితే ఇటీవలే ఆ స్థలం కొలిక్కి వచ్చింది కానీ ఇంకా పార్టీ కార్యాలయం ఏర్పాటు కాలేదు. మరోవైపు వైసీపీ సైతం రాజధానిలో తమ పార్టీ ఆఫీసు కోసం వివిధ ప్రాంతాలను పరిశీలించింది. కానీ ఇంకా తుది రూపం దాల్చలేదు. ఇదిలాఉండగా తాజాగా విజయవాడలోప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఏపీ కాంగ్రెస్ వ్యవహరాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా పార్టీ కార్యాలయానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు హాజరయ్యారు. ప్రభుత్వం తీరును నిలదీయాలని దిగ్విజయ్ సింగ్ పిలుపునిచ్చారు.
ఏపీలో పార్టీ ఆఫీసు ఓపెన్ చేయడం పట్ల షరామామూలుగానే కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అయితే అధికార పార్టీ, ప్రతిపక్ష వైసీపీ కంటే ముందుగా కార్యాలయాన్ని ఏర్పాటుచేయడం చూస్తుంటే....ఆ రెండు పార్టీల కంటే కాంగ్రెస్సే దూకుడుగా వెళుతోందని అర్థం అవుతోంది.