ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా ఓ అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. ఐపీఎల్ ఫైనల్ వేదికగా ఓ తెలుగు ఇంటర్వ్యూ వైరల్ అయ్యింది. ప్రముఖ క్రికెటర్ దినేష్ కార్తీక్ తమిళనాడుకు చెందినవాడు. అతని మాతృభాష అయిన తమిళం కూడా చాలా సరళంగా మాట్లాడగలడు. మైదానంలో వివిధ క్రికెటర్లతో కార్తీక్ తమిళంలో సంభాషించడం కూడా మనం చూశాము. ఇప్పుడు ఈ వికెట్ కీపర్ తన తెలుగు భాష మాట్లాడే నైపుణ్యాలను కూడా ఆవిష్కరించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దినేశ్ కార్తీక్ ఇంత చక్కగా తెలుగులో మాట్లాడుతాడని ఎవరూ ఊహించలేదు.
దినేష్ కార్తీక్ తెలుగు కూడా మాట్లాడగలడని చాలా మందికి తెలియదు. చెన్నై సూపర్ కింగ్స్ , కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఐపీఎల్ ఫైనల్‌కు ముందు అతని తెలుగు మాట్లాడే సామర్థ్యం బయటపడింది. గత రాత్రి ఇది వెలుగులోకి వచ్చింది. ఐపీఎల్ లో కార్తీక్ కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.
అతను స్టార్ స్పోర్ట్స్ తెలుగు కోసం ప్రత్యేకంగా ప్రీ-మ్యాచ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అతడిని స్టార్ వ్యాఖ్యాత, హైదరాబాదీ హర్ష భోగ్లే తెలుగులో ఇంటర్వ్యూ చేయడం విశేషం.. హర్ష ఈ సందర్భంగా కార్తీక్‌కు విజయ దశమి శుభాకాంక్షలు తెలిపాడు. పెద్ద ఫైనల్ కోసం సన్నాహాలు గురించి అడిగారు. కార్తీక్ తెలుగులో చాలా సరళంగా సమాధానమివ్వడం అందరినీ హర్షతో సహా అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. కార్తీక్ తెలుగు మాట్లాడే సామర్ధ్యాలను చూసి తెలుగు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హర్ష కూడా కార్తీక్ తెలుగు మాట్లాడే నైపుణ్యాలను ట్వీట్ చేసి ప్రశంసించారు, “హా! నేను దినేష్ కార్తీక్ తో తెలుగులో ప్రీ-గేమ్ ఇంటర్వ్యూ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. బాగానే తెలుగులో మాట్లాడుతాడు మన డీకే! ” అంటూ హర్ష ప్రశంసలు కురిపించాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Wow. @DineshKarthik is killing it in Telugu. As fluent as his on field conversations in Tamil with Varun Chakravarthy. #IPLFinal https://t.co/wzXWSdp2Rf pic.twitter.com/FmXdU8rY0w
— krishnamurthy (@krishna0302) October 15, 2021